Begin typing your search above and press return to search.

దేవిశ్రీప్రసాద్‌ తండ్రి ఇక లేరు

By:  Tupaki Desk   |   14 Dec 2015 3:49 AM GMT
దేవిశ్రీప్రసాద్‌ తండ్రి ఇక లేరు
X
ప్రముఖ సినీ రచయిత సత్యమూర్తి కన్నుమూశారు. సోమవారం తెల్లవారుజామున చెన్నైలోని ఆయన నివాసంలో గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. హఠాత్తుగా గుండెపోటు రావడంతో.. ఆయన్ను హాస్పిటల్‌ కు తరలించే ప్రయత్నం చేసినా.. ఈలోపే ఆయన తరలిరాని లోకాలకు వెళ్ళిపోవడం శోచనీయం. ఈ మధ్యకాలంలో సత్యమూర్తి యువ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్‌ తండ్రిగా పాపులర్‌ అయిన సంగతి తెలిసిందే.

ఆయన సుమారు 90కి పైగా సినిమాలకు రచయితగా పనిచేశారు. దేవత - చంటి - చాలెంజ్‌ - భలేదొంగ వంటి విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేశారు. ఇకపోతే సత్యమూర్తి అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం చెన్నైలో నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన మృతికి తుపాకి.కాం ప్రగాఢ సంతాపం తెలియజేస్తోంది.