Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ ఆ హోటల్‌కి అందుకే...
By: Tupaki Desk | 27 Jun 2015 5:30 PM GMTసెంటిమెంటు యందు టాలీవుడ్ సెంటిమెంటు వేరయా విశ్వధాభిరామ వినురవేమ! అని పద్యం పాడాల్సొస్తోంది. అప్పట్లో అత్తారింటికి దారేది రికార్డుల మోత మోగించిందని ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అదే సెంటిమెంటును ఫాలో అయిపోవడం టాలీవుడ్‌లో చర్చకొచ్చింది. అసలా సెంటిమెంటు సెంటేంది గురూ? అని మీక్కూడా తెలుసుకోవాలినిపిస్తే డీటెయిల్స్‌లోకి వెళ్లాల్సిందే.
పవన్ కథానాయకుడిగా నటించిన అత్తారింటికి దారేది చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పాటల్ని బార్సిలోనా (స్పెయిన్)లోని ఓ ప్రముఖ హోటల్‌లో కంపోజ్ చేశాడు దేవీ. ఆరడుగుల బుల్లెట్టు పాట పుట్టింది అక్కడే. ఈ పాట రాసింది శ్రీమణి. అత్తారిల్లు టాలీవుడ్ రికార్డులన్నిటినీ తిరగరాసింది. ఆరడుగుల బుల్లెట్టు పెద్ద హిట్టయ్యింది. అంటే ఆ సెంటిమెంటు ప్రకారం మరో రికార్డు కొట్టాలంటే మళ్లీ అక్కడే ట్యూన్లు కట్టాలని దేవీ అండ్ టీమ్ ఫిక్సయ్యారట. దీనికి నిర్మాత బి.వి.ఎస్.ఎన్ సైతం సై అన్నారు.
ఎన్టీఆర్, సుకుమార్, దేవీశ్రీ, శ్రీమణి తదితరులు అదే హోటల్‌కి రెండు నెలల క్రితం వెళ్లారు. అక్కడ టైటిల్ ట్యూన్ సహా ముఖ్యమైన ట్యూన్స్ రెడీ చేసుకుని తిరిగి హైదరాబాద్ వచ్చారు. ఎన్టీఆర్-సుకుమార్ సినిమాకి టైటిల్ సాంగ్ (మా నాన్నకు ప్రేమతో) బార్సిలోనాలో రెడీ అయ్యిందన్నమాట! ఇప్పుడర్థమైందా సెంటిమెంటు సెంటు పవరేంతో?