Begin typing your search above and press return to search.

అందర్నీ కట్టిపాడేశావ్‌ దేవి!!

By:  Tupaki Desk   |   28 Dec 2015 3:33 AM GMT
అందర్నీ కట్టిపాడేశావ్‌ దేవి!!
X
దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన మూవీ జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే.. దేవిశ్రీ ప్రసాద్ తండ్రి ప్రముఖ రైటర్ సత్యమూర్తి కాలధర్మం చెందారు. దీంతో ఎప్పుడూ తన మ్యూజిక్ ఆడియో ఫంక్షన్లలో ఎంతో ఎనర్జీతో కనిపించే డీఎస్పీ.. ఇప్పుడు మాత్రం కొంచెం బేలగా, కొంత ధైర్యంగా కనిపించాడు. తన మాటలతో అందరినీ కంటతడి పెట్టించేశాడు దేవి.

మా నాన్నకు చిరునవ్వు ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ, ఈ విషయం తెలిసి ట్విట్టర్ లోనూ ఇతర మీడియా ద్వారాను తనకు సానుభూతి తెలిపిన ప్రతీ ఒక్కరికీ ధ్యాంక్స్ చెప్పారు. తనకు, తండ్రికి మధ్య ఉన్న అనుబంధాన్ని దేవిశ్రీ పంచుకున్నాడు. తను పరిచయం చేసిన సింగర్స్ చాలామందిని.. నాన్నే రిఫరెన్స్ చేశారని గుర్తు చేసుకున్నాడు. 'తోటి టెక్నీషియన్ వర్క్ ని అభినందించ గలిగినపుడే.. నువ్వు టెక్నీషియన్ గా ఎదుగుతావని' నాన్న చెప్పారని అన్నాడు దేవిశ్రీ. అందుకే తాను చాలామందికి ఫోన్ చేసి అభినందిస్తుంటానని, ఆయనిచ్చిన స్ఫూర్తితోనే ఇలా చేస్తానంటున్నాడు డీఎస్పీ.

మన మైండ్ క్లియర్ గా ఉంటేనే సక్సెస్ వైపు వెళ్లగలమని నాన్న చెప్పేవారని అన్నాడు దేవిశ్రీ. ఆయన రైటర్ కాగా.. లెఫ్ట్ హ్యాండర్ అని, అయితే నరాల సమస్యలతో ఎడమ చేయి పడిపోయినా.. తన బాధను ఎప్పుడూ బయటపెట్టని నైజం అని దేవిశ్రీ అన్నాడు. ఆయన హాస్పిటల్ లో ఉన్నపుడు తమ్ముడు సాగర్ వీడియోలు తీసి పంపేవాడని, 'నేను బాగా ఉన్నా పని చేసుకో , నాకో మంచి ట్యూన్ ఇవ్వు చాలు' అని నాన్న చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నాడు. చివరగా.. మ్యూజిక్ లవర్స్ కి ఫ్యాన్స్ కి... ఎందుకు థ్యాంక్స్ అంటే.. మీరు డీఎస్పీ అని అరిచి చప్పట్లు కొడితే, ఆయన చాలా సంతోషించేవారు. అందుకే మీ అందరికీ థ్యాంక్స్ అంటూ.. అందరి హృదయాలను గెలుచుకున్నాడు దేవిశ్రీ ప్రసాద్.