Begin typing your search above and press return to search.
రామ్ ను ప్లేబాయ్ అనేశాడు
By: Tupaki Desk | 14 Oct 2017 6:25 AM GMTఎనర్జిటిక్ స్టార్ రామ్ ను అందమైన ప్లేబాయ్ అనేశాడు దేవిశ్రీ ప్రసాద్. ‘ఉన్నది ఒకటే జిందగీ’ ఆడియో వేడుకలో మాట్లాడుతూ దేవి ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘‘రామ్ ను నేను రామ్ బాయ్ అంటా. అతను దేవీ బాయ్ అంటుంటాడు. కానీ నేను రామ్ బాయ్ అనడంలో ఒక అర్థముంది. అతనో అందమైన ప్లేబాయ్.. అందుకే రామ్ బాయ్ అని అంటుంటాను. మరి అంత అందంగా ఉంటే తప్పదు కదా. రామ్ ను అందరూ ఎప్పుడూ ఎనర్జిటిగ్గా చూస్తారు. కానీ ‘నేను శైలజ’లో మొత్తంగా ఒక కొత్త రూపాన్ని చూపించాడు.
ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ ‘ఉన్నది ఒకటి జిందగీ’లో ఇంకా కొత్తగా కనిపిస్తాడు. చాలా మైన్యూట్ డీటైల్స్.. ఎక్స్ ప్రెషన్స్ అవసరమైన సన్నివేశాల్లో.. సెన్సిటివ్ సీన్స్ లో అద్భుతంగా చేశాడు. అతడి పెర్ఫామెన్స్ అందరినీ కట్టిపడేస్తుంది. అందరూ అతడి ప్రేమలో పడిపోతారు. ఈ సినిమాలో హీరోతో పాటు ఫ్రెండు పాత్ర కూడా అంతే సమానంగా ఉంటుంది. అలాంటి సినిమాను ఒప్పుకున్నందుకు రామ్ అభినందనీయుడు. అందరు హీరోలూ ఇలా అంగీకరించరు’’ అని దేవి అన్నాడు.
ఇక నిర్మాత స్రవంతి రవికిషోర్ గురించి చెబుతూ.. ‘‘ఆయన చాలా గొప్ప ప్రొడ్యూసర్. ఎందుకంటే నటీనటుల్ని.. టెక్నీషియన్లను బాగా చూసుకోవడమే కాదు.. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా రెమ్యూనరేషన్లో చివరి రూపాయి వరకు చెల్లంచే నిర్మాతలు గొప్ప వాళ్లు. స్రవంతి రవికిషోర్ గారు ఆ కోవలోకే వస్తారు. అందుకే ఆయన్ని నేనెంతో గౌరవిస్తాను. నేను ఈ మాటలు గుండె లోతుల్లోంచి చెబుతున్నాను’’ అని దేవిశ్రీ ప్రసాద్ అన్నాడు.