Begin typing your search above and press return to search.

పవన్ ను మళ్లీ తన వైపు తిప్పుకునేందుకు దేవిశ్రీ తీవ్ర ప్రయత్నాలు

By:  Tupaki Desk   |   6 May 2021 7:30 AM GMT
పవన్ ను మళ్లీ తన వైపు తిప్పుకునేందుకు దేవిశ్రీ తీవ్ర ప్రయత్నాలు
X
పవన్ కళ్యాణ్‌ నటించిన పలు సినిమా లకు దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందించాడు. ఆ సినిమా లు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమా లు మ్యూజికల్‌ హిట్స్ గా నిలిచాయి. అజ్ఞాతవాసి నుండి పవన్‌ వరుసగా దేవిశ్రీ తో కాకుండా మరో సంగీత దర్శకుడితో వెళ్తున్నాడు. ఇటీవల వచ్చిన వకీల్ సాబ్‌ సినిమా కు థమన్ సంగీతాన్ని అందించాడు. వకీల్ సాబ్‌ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ మరియు పాటలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. దాంతో మళ్లీ వెంటనే మరో సారి పవన్ సినిమా కు థమన్‌ అవకాశం దక్కించుకున్నాడు. వరుసగా పవన్ సినిమా లను దక్కించుకుంటున్న థమన్‌ టాలీవుడ్ లో టాప్‌ కంపోజర్ ఆ దూసుకు పోతున్నాడు. ఈ సమయంలో దేవిశ్రీ ప్రసాద్‌ కు పవన్ కళ్యాణ్ సినిమా ఆఫర్‌ దక్కింది.

హరీష్ శంకర్ దర్శకత్వం లో పవన్ చేయబోతున్న సినిమా కు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందించబోతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతోంది. కరోనా సెకండ్‌ వేవ్‌ వల్ల ఈ కాంబో మూవీ ఆలస్యం అవుతోంది. షూటింగ్ ఆలస్యం అవుతున్నా కూడా అప్పుడే సినిమా కు దేవిశ్రీ ప్రసాద్‌ ట్యూన్స్ రెడీ చేయడం మొదలు పెట్టాడట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్‌ సినిమా కు గబ్బర్‌ సింగ్ రేంజ్ పాటలను మళ్లీ అందించి ఆయన దృష్టిలో పడాలని దేవిశ్రీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం టాలీవుడ్‌ లో దేవి శ్రీ వర్సెస్‌ థమన్ అన్నట్లుగా హోరా హోరీ పోటీ ఉంది. వరుసగా వీరిద్దరు బడా హీరోల సినిమాలు దక్కించుకుంటున్నారు. ఆమద్య కాస్త పోటీలో దేవిశ్రీ వెనుక పడ్డాడు అనే వార్తలు వచ్చాయి. అల వైకుంఠపురంలో ఆల్బం తో దేవిశ్రీ పోటీ పడలేక పోయాడు అంటూ టాక్ వచ్చింది. దాంతో దేవిశ్రీ ప్రస్తుతం తాను చేస్తున్న అన్ని సినిమా లకు కసితో వర్క్‌ చేస్తున్నాడటని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్‌ వంటి స్టార్స్ తో మళ్లీ వరుసగా సినిమా లు చేయడం వల్ల టాలీవుడ్ లో తన స్థానంను మరింత పదిలం చేసుకోవాలని దేవిశ్రీ ప్రసాద్‌ భావిస్తున్నాడట.