Begin typing your search above and press return to search.
100, 150.. డీఎస్పీ డిమాండ్ కేక
By: Tupaki Desk | 31 March 2016 3:30 PM GMTరాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు సౌత్ ఇండియాలో మోస్ట్ డిమాండ్ ఉన్న మ్యూజిక్ ఉన్న డైరెక్టర్. తను రూపొందించే ప్రతీ ఆల్బంని దేనికదే ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తపడ్డం, పాటలతో కొత్త అనుభూతులను మిగల్చడం, రిలీజ్ కి ముందే తన సంగీతంతో సినిమాని సగం హిట్ చేసేస్తుండడంతో.. డీఎస్పీకి ఆఫర్లు వెల్లువెత్తడం సహజమే. ఇప్పుడు రెండు ప్రెస్టీజియస్ మూవీస్ కూడా రాక్ స్టార్ చేతికే రావడాన్ని విశేషంగా చెప్పుకోవాలి.
తన 150వ సినిమాకి దేవిశ్రీని సంగీతం అందించాల్సిందిగా.. మెగాస్టార్ స్వయంగా పబ్లిక్ ఫంక్షన్ లోనే కోరారు. సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ లో మెగాస్టార్ చేసిన రిక్వెస్ట్ ను.. స్పాట్ లోనే యాక్సెప్ట్ చేశాడు డీఎస్పీ. అంటే చిరు 150 సినిమా దేవిశ్రీ ఖాతాలోకి వెళ్లిపోయినట్లే. ఇప్పుడు నందమూరి నటసింహం బాలకృష్ణ 100వ సినిమా కోసం కూడా... దేవిశ్రీ ప్రసాద్ నే అప్రోచ్ అయ్యాడు దర్శకుడు క్రిష్.
శాతవాహన రాజు గౌతమీపుత్ర శాతకర్ణి పాత్రను హీరోగా చేసుకుని చారిత్రాత్మకంగా తెరకెక్కించే ఈ మూవీకి.. సంగీతం ఇవ్వాల్సిందిగా దేవిశ్రీప్రసాద్ ని కోరాడు క్రిష్. అమరావతి నేపథ్యంలో సాగే ఈ కథకు మ్యూజిక్ ఇచ్చేందుకు దేవి కూడా ఒప్పుకున్నాడని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలకు చెందిన రెండు క్రేజీ ప్రాజెక్టులు కూడా దేవిశ్రీ ఖాతాలోకి చేరిపోయినట్లైంది.