Begin typing your search above and press return to search.
అనిరుధ్ ఔట్.. జూనియర్ ఇన్
By: Tupaki Desk | 21 Dec 2016 7:30 AM GMTజూనియర్ ఎన్టీఆర్ 27వ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా జరుగుతున్నాయ్. అన్నయ్య కల్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మించే ఈ సినిమాకి సంబంధించిన నటీనటుల విషయంలో ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చిసినట్టే. ఇక టెక్నిషియన్స్ కూడా ఫైనలేజ్ చేసేస్తున్నారు. జూనియర్ కొత్త మూవీకి కూడా దేవీశ్రీనే బీట్స్ కొడతాడదనే లేటెస్ట్ టాక్.
క్లియర్ గా చెప్పలేదు కానీ నిన్నటి వరకు జూనియర్ కొత్త మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా తమిళ్ యంగ్ సెన్సేషన్ అనిరుధ్ పేరు వినిపించింది. అయితే ఈ లోపు మనసు మార్చేసుకోని కలిసొచ్చిన దేవీశ్రీ ప్రసాద్ నే ఫైనల్ చేశారంటున్నారు. అనిరుధ్ ని కాదనడానికి కారణాలు కూడా వినిపిస్తున్నాయ్. దేవీ - తమన్ తో పొల్చితే అనిరుధ్ కొంచెం స్లోగా పని చేస్తాడు. డెడ్ లైన్స్ పెట్టుకోని పని చేయడానికి అనిరుధ్ వ్యతిరేకం. అందుకే అనిరుధ్ ట్యూన్స్ కొత్తగా ఉంటాయంటారు ఫ్యాన్స్. పైగా ఇటు తెలుగు.. అటు తమిళ్ కలిపి ఓ నాలుగైదు సినిమాలతో అనిరుధ్ ప్రస్తుతానికి బిజీబిజీ.
పైగా అనిరుధ్ తమిళ్ లో ప్రూవ్ చేసుకున్నప్పటికీ తెలుగు ఆడియెన్స్ టేస్ట్ కి తగ్గ ట్యూన్స్ ఇస్తాడో లేదో ఇంకా ఐడియా లేదు. పవన్ కల్యాణ్ మూవీ రిలీజ్ తర్వాతే ఈ విషయంలో క్లారిటీ వస్తుంది. అందుకే త్రివిక్రమ్- పవన్ లా రిస్క్ తీసుకోడానికి జూనియర్ ఎన్టీఆర్ ధైర్యం చేయట్లేదనే వాళ్లు కూడా అన్నారు. ఊసరవెల్లి తర్వాత కొంచెం గ్యాప్ వచ్చినప్పటికీ నాన్నకు ప్రేమతో.. జనతా గ్యారేజ్ కి దేవీనే రిపీట్ చేయించాడు తారక్. ఈ రెండు సినిమాల మ్యూజిక్ కూడా సూపర్ హిట్. అందుకే అందరూ కలిసి దేవీశ్రీకే మళ్లీ ఓటేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/