Begin typing your search above and press return to search.

దేవీ పెళ్లి-తప్పుకున్నాడు మళ్ళి

By:  Tupaki Desk   |   28 Jan 2018 8:14 AM GMT
దేవీ పెళ్లి-తప్పుకున్నాడు మళ్ళి
X
సంగీత సంచనలం దేవి శ్రీ ప్రసాద్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ సొంతం చేసుకుని దూసుకుపోతున్నాడు. రామ్ చరణ్ రంగస్థలం విడుదలకు సిద్ధం అవుతున్న దశలోనే బోయపాటి శీనుతో రామ్ చరణ్ చేస్తున్న తర్వాతి సినిమా కూడా తన జేబులోనే వేసుకున్నాడు. మహేష్ తో భరత్ అను నేను షూటింగ్ ప్రోగ్రెస్ లో ఉండగా అది కంప్లీట్ అయ్యాక ప్రిన్స్ చేయబోయే 25వ సినిమాకు కుడా దేవినే సంతకం చేసాడు. వంశీ పైడిపల్లి దీనికి దర్శకుడు. ఇవి కాకుండా త్రివిక్రమ్-జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు సైతం అనిరుద్ ని కాకుండా దేవినే తీసుకోవాలనే చర్చలు జరుగుతున్నాయని మరో టాక్. కిరాక్ అనిపించే పాటలతో స్టార్ హీరోల సినిమాలకు మంచి క్రేజ్ తీసుకొచ్చే దేవి ఇంకా బ్రహ్మచారే.

దీని గురించి ఒక మీడియా ఇంటర్వ్యూలో పాత్రికేయులు పెళ్లి గురించి అడిగిన ప్రశ్నకు దేవి సమాధానమిస్తూ తాను సంతోషంగా ఉండటం మీకు ఇష్టం లేదా అని రివర్స్ కౌంటర్ వేసి అందరిని నవ్వించేసాడు. అంటే పెళ్లి చేసుకుంటే మనఃశాంతి దూరమవుతుందని చెప్పకనే చెప్పేసాడు. సరదాకు అన్నా దేవి శ్రీ ప్రసాద్ పెళ్లి గురించి ఆలోచించాల్సిన టైం అయితే వచ్చేసింది. తండ్రి సత్య మూర్తి అకాల మరణం చెందాక ఆ ఆలోచన మానేసిన దేవి మీద అప్పట్లో ఒక హీరొయిన్ తో అఫైర్ ఉందనే పుకార్లు బలంగా షికారు చేసాయి. ఇప్పటికైతే ఏదో జోక్ వేసి తప్పుకున్నాడు కాని దేవి శ్రీ ప్రసాద్ ఇప్పుడు కాకపోయినా త్వరలో పెళ్లి కబురు చెప్పాలని ఫాన్స్ ఎదురు చూస్తున్నారు. లైవ్ కన్సర్ట్స్ తో అదరగొట్టే దేవి తన పెళ్ళికి ఎవరితో స్టేజి షో చేయిస్తాడో చూడాలి.