Begin typing your search above and press return to search.
జనతా గ్యారేజ్.. వాయింపు మొదలైంది
By: Tupaki Desk | 14 April 2016 4:35 AM GMTఆగస్టు 12న ‘జనతా గ్యారేజ్’ను రిలీజ్ చేసే విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేలా లేడు కొరటాల శివ. ప్రి ప్రొడక్షన్ వర్క్ విషయంలో బాగా టైం తీసుకున్న కొరటాల.. షూటింగ్ విషయంలో ఏ తడబాటూ లేకుండా సాఫీగా పని కానిచ్చేస్తున్నాడు. ఓవైపు శరవేగంగా సినిమాను పూర్తి చేస్తూనే మరోవైపు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలుపెట్టేశాడు. జనతా గ్యారేజ్’ కోసం దర్శకుడు కొరటాల.. గీత రచయిత రామజోగయ్య శాస్త్రిలతో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుపుతున్నప్పటి ఫొటోను నిన్న రాత్రి ట్విట్టర్లో షేర్ చేశాడు దేవిశ్రీ ప్రసాద్. కొరటాల-శాస్త్రిలతో కలిసి నిన్నంతా కంపోజింగ్ చాలా బాగా సాగిందని ట్వీట్ చేశాడు దేవి. ఈ ఫొటో.. దేవి మాట చూసి ఎన్టీఆర్ అభిమానుల్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది.
కొరటాల-దేవి-రామగోగయ్య కాంబినేషన్లో వచ్చిన మిర్చి-శ్రీమంతుడు సినిమాలు మ్యూజికల్ గానూ సూపర్ హిట్లయ్యాయి. మళ్లీ ఈ కాంబినేషన్లో సినిమా అంటే అంచనాలు మామూలుగా ఉండవు. ఈ మధ్య ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విషయంలో దేవి కొంచెం హడావుడి పడటంతో ఆడియో అంచనాలకు తగ్గట్లుగా తయారవలేదు. ఐతే ‘జనతా గ్యారేజ్’ విషయంలో మాత్రం ముందు నుంచి బాగా టైం తీసుకుని పని చేస్తున్నట్లున్నాడు. కాబట్టి మంచి ఆడియోనే ఆశించవచ్చు. ఆగస్టులో సినిమా రిలీజ్ అంటే జులైలో ఆడియో విడుదలవుతుందన్నమాట. బహుశా పాటల చిత్రీకరణ కూడా పక్కాగా ఉండాలనే.. దేవితో ఇంత ముందుగా పని మొదలుపెట్టించినట్లున్నాడు కొరటాల.