Begin typing your search above and press return to search.
అంత స్ట్రిక్ట్ గా ఉండబట్టే..
By: Tupaki Desk | 16 May 2017 4:30 AM GMTబాహుబలి2 ఇప్పుడు సెన్సేషన్స్ సృష్టించేస్తోంది. ఖాన్ హీరోలు నటించిన హిందీ బ్లాక్ బస్టర్స్ కూడా అందుకోలేకపోయిన కొత్త చరిత్రను బాహుబలి2 సృష్టించేసింది. ఒక డబ్బింగ్ మూవీ ఇలాంటి హిస్టరీ క్రియేట్ చేయడాన్ని అక్కడి జనాలు జీర్ణించుకోలేకపోతున్నారు. కానీ మొదటి నుంచి దీన్నో డబ్బింగ్ మూవీగా భావించలేదు యూనిట్. అందుకే ఇప్పుడు ఇంతటి ప్రతిఫలాన్ని అందుకోగలుగుతున్నారు.
బాహుబలి ది బిగినింగ్ విషయంలో అక్కడి వారి ఆటిట్యూడ్ ఫేస్ చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు.. దేవిక బహుదానం. ఈమె బాహుబలి రెండు భాగాలకు హిందీ వెర్షన్ డబ్బింగ్ పనులను పర్యవేక్షించారు. ఇది కేవలం తెలుగు సినిమా కాదు.. భారతీయ చిత్రం అనే నమ్మకంతో.. వర్క్ చేసినట్లు ఆమె చెబుతున్నారు. నిర్మాతతో కలిసి ముంబై వెళ్లి.. డబ్బింగ్ పనులను పర్యవేక్షిస్తున్నపుడు ఎంతో ఆశ్చర్యపోయారట. ఏదో మొక్కుబడిగా కొన్ని గంటల్లో పని పూర్తి చేసుకోపోవడం తప్ప.. పాత్రను.. కథను అర్ధం చేసుకునే ప్రయత్నం ఎవరూ చేయకపోవడం చూసి ఆశ్చర్యపోయానని చెబుతారామె.
'సరిగా డబ్బింగ్ చెప్పని ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ ను అయితే స్టూడియో నుంచి వెళ్లిపోమన్నాను. నేను చెప్పినట్లు వినకపోతే.. రూంలోంచి వెళ్లిపోవచ్చని కూడా చెప్పాను' అంటున్నారు దేవిక. అప్పుడు అంత కఠినంగా ఉండబట్టే.. ఇప్పుడు డైరెక్టు హిందీకి మించి ప్రజల నుంచి ఆదరణ లభిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/