Begin typing your search above and press return to search.
దేవీశ్రీ ఖాతాలో సల్మాన్-దేవగన్-రణ్ వీర్
By: Tupaki Desk | 7 Oct 2022 4:43 AM GMTరాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ఇటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీ 'పుష్ప 2' కి సంగీతం అందిస్తూ ట్రెండింగులో ఉన్నాడు. అటు బాలీవుడ్ లోను వరుసగా స్టార్ హీరోల సినిమాలకు కమిటవుతూ వేడి పెంచుతున్నాడు. ఇతర సౌత్ మ్యూజిక్ డైరెక్టర్లతో పోలిస్తే దేవీశ్రీ ఇరుగు పొరుగు భాషల్లోనూ సత్తా చాటుతున్నాడని చెప్పాలి.
ఇప్పటికే సల్మాన్ భాయ్ తో సుదీర్ఘ కాలంగా అనుబంధం కొనసాగిస్తున్నాడు. భాయ్ సినిమాలకు స్పెషల్ నంబర్లను అందించి చార్ట్ బస్టర్లలో నిలుపుతున్నాడు. మరోవైపు అజయ్ దేవగన్ నటిస్తున్న తాజా చిత్రం దృశ్యం 2 కి కూడా దేవీశ్రీ సంగీతం అందిస్తున్నాడు. ఇది బాలీవుడ్ ఫార్మాట్ కి భిన్నంగా పూర్తి స్థాయి సినిమాకి పని చేసే అరుదైన అవకాశం.
తాజా సమాచారం మేరకు ...పాపులర్ డైరెక్టర్ రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న సిర్కస్ కోసం 'ఓదార్పు డ్యాన్స్ నంబర్' ని దేవీశ్రీ కంపోజ్ చేసారని తెలిసింది. బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్- రోహిత్ శెట్టి కాంబినేషన్ లో అరుదైన మూవీ ఇది. సింబా తర్వాత ఈ జోడీ మరోసారి బ్లాక్ బస్టర్ కోసం ప్రయత్నాల్లో ఉంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే -జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలోని ఒక పాటను స్వరకర్త దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచగా రణవీర్ ఈ పాటను పాడారు. దేవీశ్రీ ఇప్పటికే దక్షిణాదిలో చార్ట్ బస్టర్ లను అందిస్తూనే తరచుగా హిందీలో కూడా పనిచేస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో రాక్ స్టార్ DSP సిర్కస్ లో తన పాట నుండి ప్రజలు ఏమి ఆశించవచ్చనే దానిపై క్లూ ఇచ్చాడు.
రణవీర్ సింగ్ - రోహిత్ శెట్టితో కలిసి పనిచేసిన అనుభవం గురించి ప్రశ్నించగా... DSP ఇలా చెప్పాడు. ''అతను(రణవీర్) చాలా మంచి వ్యక్తి. నేను తనతో పనిచేయడాన్ని ఆనందించాను. రణవీర్ తన సాంకేతిక నిపుణుడిని సిబ్బందిని తనవారిని గౌరవించే విధానం నిజంగా అద్భుతం. కాబట్టి ట్రాక్ లో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. మేము కలిసినప్పుడు అతను సిర్కస్ పాటను మొత్తం సాహిత్యంతో పాడటం ప్రారంభించాడు. కాబట్టి అతను దానిని బాగా గుర్తుంచుకున్నాడు. నిజానికి నేను తనతో ''నువ్వు రాపర్ మాత్రమే కాదు... నిజానికి నువ్వు చాలా మంచి గాయకుడివి'' అని చెప్పాను. అతను ''లేదు.. నేను పాడలేను'' అన్నాడు. అతను అంగీకరించలేదు. కానీ అతను చాలా బాగా పాడాడు. కాబట్టి ఏదో ఒక రోజు మనం అతనిని ఒక సీరియస్ పాట.. ఒక సీరియస్ ట్యూన్ పాడించాలని నేను భావిస్తున్నాను... అని దేవీశ్రీ అన్నారు.
ఈ పాట నిజంగా విజువల్స్ తో అద్భుతంగా వచ్చింది. ఇది సినిమాలో చాలా ప్రత్యేకమైన పాట. నా వరకూ ఇది ప్రత్యేకమైన పాట.. ఎందుకంటే ఇది చక్కని గాడితో కూడిన మెలోడీ... అనుభూతిని కలిగించే పాట .. మనల్ని డ్యాన్స్ చేయాలని ప్రేరేపించే పాట. ఆ కాంబినేషన్ లో నేను హిందీలో ఎప్పటినుండో చేయాలనుకున్న ఒక పాట. చివరకు ఈ చిత్రంతో నాకు ఆ అవకాశం దక్కింది. దీనికోసం నిజంగా చాలా వేచి చూసాను. ఈ పాటను పెద్దతెరపై చూడటం కోసం ఇప్పుడు ఎదురు చూస్తున్నాను'' అని అన్నారు.
ఇది డ్యాన్స్ నంబర్ తరహానా? అని అడిగినప్పుడు, ''ఇది చాలా చాలా ఓదార్పుతో కూడుకున్న నృత్యంతో కంటెంట్ ఆకట్టుకుంటుంది'' అని తెలిపారు. సిర్కస్ లో సంజయ్ మిశ్రా- జానీ లివర్ -, వరుణ్ శర్మ - సిద్ధార్థ్ జాదవ్ కూడా నటించారు. ఇది 23డిసెంబర్ 2022న విడుదల కానుంది.
దేవి శ్రీ ప్రసాద్ తన మొట్టమొదటి నాన్-ఫిల్మ్ హిందీ సింగిల్ 'ఓ పరి'ని ఇటీవలే విడుదల చేశాడు. ఈ పాటకు మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఈ వారం ప్రారంభంలో రణవీర్ సింగ్ తో సిర్కస్ కోసం పాటను ప్రారంభించాడు. అజయ్ దేవగన్ 'దృశ్యం 2'కి కూడా అతను కంపోజ్ చేస్తున్నాడు. తన స్నేహితులు బన్ని-సుక్కూ ల 'పుష్ప 2' కోసం స్పెషల్ గా దృష్టి సారించి ట్యూన్స్ అందిస్తున్నాడని సమాచారం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.