Begin typing your search above and press return to search.
ట్యూషన్ పేరుతో తప్పుగా ప్రవర్తించాడు.. బుల్లితెర నటి షాకింగ్ కామెంట్స్..!
By: Tupaki Desk | 25 Nov 2021 11:30 PM GMTమీ టూ ఉద్యమం తెరపైకి వచ్చాక చాలామంది నటీనటులు తమకు జరిగిన లైంగిక వేధింపులపై గళం విప్పుతూ వస్తున్నారు. నిత్యం ఏదోఒక వివాదాల్లో చిక్కుకునే బాలీవుడ్ ఇండస్ట్రీపై సైతం మీటూ ఉద్యమంలో భాగంగా పలు విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు బడా హీరోలు, నిర్మాతలు, దర్శకులపై సంచలన ఆరోపణలు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. అయితే వీటిలో కొన్ని మాత్రమే నిజమైన ఆరోపణలు ఉండగా మరికొన్ని వదంతులుగానే మిగిలిపోయాయి.
వీటన్నింటిని పక్కన పెడితే తాజాగా మరోనటి తన చిన్నతనంలో జరిగిన అనుభవాన్ని వివరిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆ నటి ఎవరు? అసలు సంగతి ఎంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. హిందీ బుల్లితెరపై స్టార్డమ్ తోపాటు కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నటి దేవోలినా భట్టాచార్య. బుల్లితెరపై నటనతో ఆకట్టుకున్న దేవోలినా భట్టాచార్య బిగ్ బాస్ షోలో తన గ్లామర్ తో ఆకట్టుకొని మరింత మంది అభిమానులకు చేరువైంది.
తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన చిన్నతనంలో జరిగిన ఓ చేదు నిజాన్ని బయటపెట్టింది. చిన్నతనంలో తాను సైతం లైగింక వేధింపులకు గురైనట్లు చెప్పుకొచ్చింది. చిన్నప్పుడు తనకు ట్యూషన్ చెప్పే మ్యాథ్ టీచర్ ఓసారి తప్పుగా ప్రవర్తించినట్లు ఆరోపించింది. అతడి ప్రవర్తన బాగోలేకపోవడంతో తన తల్లికి చెప్పినట్లు వివరించింది.
అయితే తన తల్లి ఆ తర్వాత టీచర్ ఇంటికి వెళ్లి తన భార్యకు జరిగిన విషయాన్ని చెప్పి వార్నింగ్ ఇచ్చిందని చెప్పింది. అంతేగానీ తన కుటుంబ సభ్యులెవరూ అతడిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదని చెప్పుకొచ్చింది. కాగా తనకు మాత్రం ఆ టీచర్ పై స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటే బాగుండేదని మనస్సులో అనిపించిందని అసలు విషయాన్ని బయటపెట్టింది. చిన్నపిల్లలతో తప్పుగా ప్రవర్తించే వ్యక్తులను అసలు విడిచిపెట్టొద్దంటూ దేవోలినా భట్టాచార్య పిలుపునిచ్చింది.