Begin typing your search above and press return to search.
సెంచరీ కొట్టిన 'ధమాకా'..మాస్ రాజా లెక్క మారిందే!
By: Tupaki Desk | 6 Jan 2023 5:57 AM GMTమాస్ మహారాజా రవితేజ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ధమాకా' వసూళ్లతో బాక్సాఫీస్ ని షేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విజయవంతంగా మూడో వారంలోకి అడుగుపెట్టింది. తాజాగా ఈ సినిమా వసూళ్లలో అరుదైన ఘనత సాధించినట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కేవలం రెండు వారాల్లోనే 100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తుంది.
ఆ రకంగా రవితేజ కెరీర్ లో 100 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రం ఇదే. ఇంత వరకూ రాజా కెరీర్లో సెంచరీ కొట్టింది లేదు. ఆయన హీరోగా నటించిన చాలా సినిమాలు భారీ వసూళ్లు సాధించాయి. కానీ 100 కోట్ల క్లబ్ లో ఏ చిత్రం చేరలేదు. ఆ రకంగా ధమాకా హీరోకి ఊహించని ధమ్కీ ఇచ్చింది.
ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ లోనే పూర్తి పెట్టుబడిని రికవరీ చేసిందిట. థియేట్రికల్ బిజినెస్ ద్వారా సినిమా ఎంత వసూల్ చేసినా? అది నిర్మాతలకు అదనపు ఆదాయమే అని తెలుస్తుంది. ఈనేపథ్యంలో 100 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా నిర్మాతలకు.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు తెస్తుందని వినిపిస్తుంది. వసూళ్ల పట్ల సర్వం హర్షం వ్యక్తం చేస్తున్నారుట.
మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాటు.. సినిమాలో తగిన వినోదం కూడా ఉంది. చాలా కాలం తర్వాత ఇలాంటి వినోదాత్మక పాత్రలో రవితేజను చూడాలని అభిమానులు థియేటర్లలో సందడి చేస్తున్నారు. అతని స్క్రీన్ ప్రెజెన్స్.. ఎనర్జీ.. కామెడీ టైమింగ్.. ఫైట్స్.. డ్యాన్స్‌లు చూడదగ్గవని అభిమానులంటున్నారు. యాక్షన్.. కామెడీ కలగలిపిన పూర్తి పైసా వసూల్ ఎంటర్‌టైనర్ అని టాక్ వినిపిస్తుంది.
రవితేజ మాస్ స్టామినా -స్టార్ పవర్‌కి ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ ఓ నిదర్శనం అని తెలుస్తుంది. తాజాగా సంక్రాంతి సెలవులు కూడా 'ధమాకా' కి కలిసొస్తాయని తెలుస్తుంది. విద్యార్ధులు...చుట్టాలు..పక్కాలు ధమాకా థియేటర్ కి వెళ్తే ఆ సినిమా ఇంకామంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంది.
ఇందులో రవితేజకి జోడీగా శ్రీలీల నటించింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై టిజి విశ్వ ప్రసాద్ మరియు వివేక్ కూచిభొట్ల నిర్మించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.