Begin typing your search above and press return to search.
ధమాకా బాక్సాఫీస్.. టార్గెట్ ఎంతంటే?
By: Tupaki Desk | 22 Dec 2022 2:30 AM GMTటాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా చాలా కాలంగా ఒకే తరహా మార్కెట్ తో కొనసాగుతూ ఉన్నాడు. కొన్నిసార్లు భారీ స్థాయిలో సక్సెస్ అందుకుంటున్నప్పటికీ మరికొన్నిసార్లు దారుణమైన డిజాస్టర్స్ కూడా ఎదుర్కొంటున్నాడు. అయితే ఈ స్టార్ హీరోకు అవకాశాలు మాత్రం అసలు తగ్గడం లేదు. ముఖ్యంగా మాస్ కమర్షియల్ దర్శకులు ఈ హీరోతో సినిమా చేసేందుకు ఎగబదుతున్నారు.
ఇక ఇప్పుడు త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో చేసిన ధమాకా సినిమా గ్రాండ్ గా డిసెంబర్ 23న విడుదల కాబోతోంది. రవితేజ క్రాక్ తర్వాత చేసిన ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీకి వరుసగా దెబ్బకొట్టినప్పటికీ ఇప్పుడు అసలు ధమాకా సినిమా రేంజ్ అయితే తగ్గలేదు. సాంగ్స్ తో ఈ సినిమా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది.
ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఎంత బిజినెస్ చేసింది అనే వివరాల్లోకి వెళితే దాదాపు అన్ని ఎఫియాలకు కూడా నిర్మాతలు ఈ సినిమా హక్కులను థియేట్రికల్ గా అమ్ముకున్నట్లుగా తెలుస్తోంది. ఇక నైజాం ఏరియాలో 5.5 కోట్ల రేంజ్ లో ధర పలికిన ఈ సినిమా సీడెడ్ 2.5 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఆంధ్రాలో 8 కోట్లు కాగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం చూసుకుంటే 16 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు సమాచారం.
ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అలాగే ఓవర్సీస్ లో కలుపుకొని ధమాకా 2.30 కోట్ల వరకు ధర పలికింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే మీ సినిమా 18.30 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. అంటే బాక్సాఫీస్ వద్ద ధమాకా సినిమా సక్సెస్ కావాలి అంటే 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే సెట్ అయ్యింది.
ఇంతకుముందు రెండు సినిమాలు కూడా తీవ్రంగా నిరాశపరచినప్పటికీ కూడా రవితేజ ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. క్రిస్మస్ సెలవులతో పాటు న్యూ ఇయర్ కూడా ఈ సినిమాకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన కూడా రవితేజ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకోవచ్చు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.