Begin typing your search above and press return to search.
ధమాకా క్లోజింగ్ కలెక్షన్స్: మాస్ రాజా దెబ్బ అదుర్స్ కదూ
By: Tupaki Desk | 21 Jan 2023 9:30 AM GMTమాస్ మహారాజ రవితేజ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా త్రినాథ రావు దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ధమాకా. డిసెంబర్ 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్ దక్కించుకుంది.
సినిమా రొటీన్ గానే ఉన్నా సినిమాకి మంచి పాజిటివ్ టాక్ దకడంతో వసూళ్ల వర్షం కురిసింది. ఊహించని విధంగా రవితేజ కెరియర్ లో ఈ సినిమా అత్యధిక వసూళ్లు కలెక్ట్ చేసి ఆయనకు స్వీట్ షాక్ ఇచ్చేసింది.
ఈ సినిమాకి త్రినాధ రావు దర్శకత్వం వహించగా బెజవాడ ప్రసన్న కుమార్ కథ అందించారు. తమన్ అందించిన సంగీతం సూపర్ హిట్ కావడంతో దాదాపుగా పాటలన్నీ చాట్ బస్టర్లుగా నిలిచాయి. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ల మీద టీజీ విశ్వప్రసాద్ వివేక్ కూచిభట్ల సుమారు 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు.
అయితే సినిమా రిలీజ్ ముందే సినిమా 20 కోట్ల ప్రీ రిలీజ్ జరుపుకుంది. ఇక ఈ సందర్భంగా టోటల్ గా సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసింది అనే విషయం పరిశీలిస్తే 28 రోజులలో ఈ సినిమా నైజాంలో 19 కోట్లు, సీడెడ్ లో 8 కోట్లు, గుంటూరులో కోటి 91 లక్షలు, కృష్ణ జిల్లాలో కోటి 85 లక్షలు, నెల్లూరులో కోటి పాతిక లక్షలు, పశ్చిమగోదావరి జిల్లాలో కోటి మూడు లక్షలు, తూర్పుగోదావరి జిల్లా కోటి 35 లక్షలు సాధించింది. అలా ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాలలోనే 40 కోట్ల షేర్, 70 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
అలాగే మిగతా ప్రాంతాలలో కూడా మూడు కోట్ల 75 లక్షల షేర్, ఓవర్సీస్ లో మూడు కోట్లు వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల షేర్, 85 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి రవితేజ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది.
ఇక ఈ సినిమా థియేటర్ రన్ ముగిసే సమయానికి దాదాపు 25 కోట్ల షేర్ డిస్ట్రిబ్యూటర్లకు లాభాలుగా మిగిలింది అలాగే 2022లో చివరి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.