Begin typing your search above and press return to search.
ధమాకా, ధమ్కీ.. ఆ సినిమాతో పోలికలు!
By: Tupaki Desk | 11 Dec 2022 2:30 PM GMTసినిమా ప్రపంచంలో ఇప్పుడు సరికొత్త తరహా కథలను తీసుకురావడం అనేది పెద్ద ఛాలెంజింగ్ గా మారింది. డిఫరెంట్ పాయింట్స్ తో ప్రేక్షకులను మెప్పించడం కూడా మరొక పెద్ద సాహసం అనే చెప్పాలి. ఇక రొటీన్ ఫార్మాట్లో సక్సెస్ కొడితే అదొక రికార్డు మిగిలిపోతుంది. ఏదేమైనప్పటికీ ఆడియన్స్ కు నచ్చిందా లేదా అనే ఆలోచనతోనే ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలు అడుగులు వేస్తూ ఉంటారు.
అయితే ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ధమాకా ధమ్కీ అనే రెండు సినిమాలకు గతంలో వచ్చిన ఒక సినిమాతో పోలికలు ఉన్నాయి అనే తరహాలో కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. మాస్ మహారాజా రవితేజ నటించిన ధమాకా సినిమా డిసెంబర్ 23వ తేదీన విడుదల కాబోతోంది. త్రినాధ రావు నక్కినా దర్శకత్వంలో తెరపైకి రానున్న ఈ సినిమాలో మాస్ మహారాజా రెండు విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు.
అయితే ఈ సినిమాలో ఒక పాత్ర చాలా ధనవంతుడిగాను మరొక పాత్ర నిరుపేద బ్యాక్ డ్రాప్ లో ఉంటుందట. ఇక రెండు క్యారెక్టర్స్ తో దర్శకుడు ఒకవైపు మంచి ఎంటర్టైన్మెంట్ మరొకవైపు ఎమోషనల్ పాయింట్ ను హైలెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దాదాపు ఇదే తరహాలో దమ్కీ సినిమా టీజర్ తో కూడా క్లారిటీ వచ్చేసింది. అందులో కూడా ధనవంతుడు పేదవాడు అయిన హీరో క్యారెక్టర్స్ చేంజ్ అయితే ఎలా ఉంటుంది అనే పాయింట్ తోనే సినిమా కొనసాగుతున్నట్లు అర్థమవుతుంది.
అయితే ఇంతకు ముందు గోపీచంద్ నటించిన గౌతమ్ నంద సినిమా కూడా ఇదే తరహా కథతో వచ్చిందే. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఈ రొటీన్ కమర్షియల్ పాయింట్ ను ఎంత విభిన్నంగా తెరపైకి తీసుకొచ్చినప్పటికీ సక్సెస్ అయిన సందర్భాలు కస్తా తక్కువగానే ఉన్నాయి. మరి ఇప్పుడు ధమాకా దమ్కీ సినిమాలు ఇలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.