Begin typing your search above and press return to search.

మాస్ రాజాకి 'ధ‌మాకా' కీల‌క‌మే!

By:  Tupaki Desk   |   27 Nov 2022 3:30 AM GMT
మాస్ రాజాకి ధ‌మాకా కీల‌క‌మే!
X
మాస్ మ‌హారాజా ర‌వితేజ బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్ ల్ని ఖాతా లో వేసుకున్న‌సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లి కాలంలో ఆయ‌న న‌టించిన సినిమాల‌న్ని బాక్సాఫీస్ వ‌ద్ద అంచ‌నాలు త‌ప్పుతున్నాయి. స‌క్సెస్ ట్రాక్ లోకి వ‌చ్చాసాడు అనుకుంటోన్న సమ‌యంలో మ‌ళ్లీ గ‌తాన్ని త‌ల‌పిస్తున్నారు. మ‌రి తాజా ప‌రిస్థితుల్ని విశ్లేషించి చూస్తే మ‌రోసారి రాజా డేంజ‌ర్ జోన్ లో ప‌డ్డారా? 'ధ‌మాకా' తో గెలుపు గుర్రం ఎక్క‌క‌పోతే ప‌రిస్థితి మరింత‌ జ‌ఠిల‌మ‌వుతుందా? అంటే అవున‌న్న‌ది ఫిలిం స‌ర్కిల్స్ టాక్.

ప్ర‌స్తుతం ర‌వితేజ చేతిలో మూడు సినిమాలున్నాయి. 'ధ‌మాకా'తో పాటు..'టైగ‌ర నాగేశ్వ‌ర‌రావు'. ...కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని కొత్త సినిమా. 'ధ‌మాకా'.. 'నాగేశ్వ‌ర‌రావు' ఆన్ సెట్స్ లోఉన్నాయి. అయితే రాజా తాజా ప‌రిస్థితుల నేప‌థ్యంలో 'ధ‌మాకా' త‌ప్ప‌క విజ‌యం సాధించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంది. 'ధ‌మాకా' ప‌క్కా మాస్ ఎంట‌ర్ టైన‌ర్. త్రినాధ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాపై రాజా స‌హా అభిమానులు చాలా ఆశ‌లే పెట్టుకున్నారు.

త్రినాధ‌రావుకి ఇంత‌వ‌ర‌కూ వైఫ‌ల్యం లేదు. క‌మర్శియ‌ల్ మేక‌ర్ గా మంచి పేరు సంపాదించాడు. ఆయ‌న సినిమాల‌న్ని యూత్ కంటెంట్ తోనే ఉంటాయి. ఆ కోవ‌లో 'ధ‌మాకా' పై అంచ‌నాలు గెస్ చేయోచ్చు. కొంత వ‌ర‌కూ ర‌వితేజ సేఫ్ జోన్ లో ఉన్న‌ట్లే. అయితే మిగ‌తా రెండు సినిమాలు ర‌వితేజ ఓ ప్ర‌యోగంగానే భావించాలి. ఎందుకంటే టైగ‌ర్ నాగేశ్వ‌రు అనేది ఓ బ‌యోపిక్.

వంశీకృష్ణ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గ‌తంలో ఆయ‌న తెర‌కెక్కించిన 'కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త' యావ‌రేజ్ గా ఆడ‌గా 'దొంగాట' ప్లాప్ అయింది. ఇక యంగ్ మేక‌ర్ కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని రాజా తో ఎలాంటి రిస్క్ తీసుకుంటున్నాడో తెలియ‌దు.

అత‌నికి ద‌ర్శ‌కుడిగా అంత అనుభ‌వం లేదు. 'సూర్య వ‌ర్సెస్ సూర్య' సినిమా చేసాడు గానీ అది ఫెయిలైంది.

మేకింగ్ ప‌రంగా పేరొచ్చినా క‌మ‌ర్శియ‌ల్ గా స‌క్స‌స్ కాలేదు. ఆ ర‌కంగా ర‌వితేజ ఆ రెండు సినిమాల విష‌యంలో పూర్తి స్థాయిలో డిపెండ్ అవ్వ‌డం అన్న‌ది సాహ‌సంగానే భావించాలి. ఒక వేళ ఆ రెండు చిత్రాలు ఆశించిన ఫ‌లితాలు సాధించ‌న‌ప్ప‌టికీ ధ‌మాకా స‌క్సెస్ అయితే గ‌నుక కొంత వ‌ర‌కూ డిపెండ్ చేసుకోవ‌డానికి అవ‌కాశం ఉంటుంది. లేదంటే? స‌న్నివేశం మ‌రోలా ట‌ర్న్ తీసుకోవ‌డానికి ఛాన్స్ లేక‌పోలేదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.