Begin typing your search above and press return to search.

ధమాకా రవితేజ.. ది గ్రేట్ క్రాక్ రికార్డులు బ్రేక్!

By:  Tupaki Desk   |   30 Dec 2022 5:30 PM GMT
ధమాకా రవితేజ.. ది గ్రేట్ క్రాక్ రికార్డులు బ్రేక్!
X
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ఒక రెండు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకుంటే మళ్ళీ వెంటనే మరో రెండు మూడు సినిమాలతో డిజాస్టర్స్ అందుకుంటున్నాడు. అయితే కొన్నిసార్లు రవితేజ కమర్షియల్ సినిమాలతోనే ఊహించని స్థాయిలో సక్సెస్ అందుకోవడం విశేషం. ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్ ను బట్టి చూస్తే అసలు మాస్ కమర్షియల్ సినిమాలు అంతగా ఆడవని కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి.

కానీ రవితేజ మాత్రం అలాంటి కామెంట్స్ కు భిన్నంగా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు. రవితేజ మాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అని మరోసారి రుజువైంది.

ధమాకా సినిమా మొదటి వారంలోనే ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. గతంలో రాజా ది గ్రేట్, క్రాక్ సినిమాలు సాధించిన రికార్డులు కూడా కొంత బ్రేక్ అయ్యాయి.

ఇప్పటివరకు మాస్ మహారాజ రవితేజ మొదటి వారంలో అంటే మొదటి 7 రోజుల్లో అందుకున్న కలెక్షన్స్ వివరాలలోకి వెళితే.. మొదటగా రాజా ది గ్రేట్ సినిమా 24.10 కోట్ల షేర్ కలెక్షన్స్ అలాగే 40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది.

ఇక మళ్ళీ క్రాక్ సినిమాకు వచ్చే సమయానికి ఆ సినిమాతో ఫస్ట్ వీక్ లోనే 22.2 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకున్న రవితేజ 38 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు త్రినాధ రావు దర్శకత్వంలో వచ్చిన ధమాకా సినిమా కూడా అదే స్థాయిలో మంచి కలెక్షన్స్ అందుకుంది. మొత్తంగా మొదటి 7 రోజుల్లో ధమాకా సినిమా 25.22 కోట్ల షేర్ కలెక్షన్స్, 47.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఇక మొత్తంగా ఈ సినిమా ఇప్పటివరకు 6 కోట్లకు పైగా ప్రాఫిట్ తో కొనసాగుతోంది. అలాగే న్యూ ఇయర్ వీకెండ్ హాలిడేస్ కూడా ఈ సినిమాకు బాగా ఉపయోగపడే అవకాశం ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.