Begin typing your search above and press return to search.

ధ‌మాకా గ్లింప్స్: అమ్మాయిని చిలిపిగా అలా ఒప్పించేసిన రాజా..!

By:  Tupaki Desk   |   31 Aug 2022 2:31 PM GMT
ధ‌మాకా గ్లింప్స్: అమ్మాయిని చిలిపిగా అలా ఒప్పించేసిన రాజా..!
X
ఒక అంద‌మైన అమ్మాయి.. ఫ్రెండు పెళ్లిలో అలా వ‌య్యారంగా సిగ్గులొల‌క‌బోస్తూ అంద‌మైన చీర‌క‌ట్టులో క‌నిపించింది. ఇంతలోనే ఆ కొంటె యువ‌కుడు త‌న‌నే చిలిపిగా చూశాడు. క‌ళ్ల‌తోనే బోలెడ‌న్ని సైగ‌లు చేసాడు. ప‌క్క‌కి ర‌మ్మ‌ని కూడా పిలిచేసాడు. క‌ను రెప్ప‌ల క‌ద‌లిక‌ల‌తోనే బోలెడ‌న్ని సిగ్న‌ల్స్ పంపాడు.

మొద‌ట మారాం చేసిన ఆ అంద‌మైన అమ్మాయి అత‌డి సిగ్న‌ల్స్ ధాటికి త‌ట్టుకోలేక చివ‌రికి ఓకే చెప్పేసింది. అంతేనా ప‌క్క‌కు జంప‌య్యారు కూడా!! అలా సింపుల్ ఎక్స్ ప్రెష‌న్స్ తోనే అమ్మాయిని ఒప్పించి బాగానే లాక్కెళ్లావు రాజా! అనేంత‌గా యూత్ కి క‌నెక్ట‌యిపోయింది ఈ చిలిపి సీన్.

ఇంత‌కీ ఇది ఏ మూవీలో స‌న్నివేశం అంటారా? ర‌వితేజ‌ `ధ‌మాకా` గ్లింప్స్ ఇది. ధ‌మాకా టీజ‌ర్ గ్లిమ్స్ వైర‌ల్ గా దూసుకెళుతోంది. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ధమాకా ప్రొడక్షన్ పనులు పూర్తి కావస్తుండగా విడుదలకు సిద్ధమవుతోంది. టీమ్ ఇటీవలే మొదటి పాటను విడుదల చేయ‌గా వైర‌ల్ అయ్యింది. ప్ర‌చారంలో ఇప్ప‌టికే వేగం పెంచారు.

ఇంత‌లోనే వినాయ‌క చ‌వితి స్పెషల్ గా ఈ రోజు ఒక రొమాంటిక్ గ్లింప్స్ ను విడుదల చేసారు. వీడియోలో రవితేజ పెళ్లిలో శ్రీలీలకి రొమాంటిక్ గా సిగ్నల్స్ ఇస్తూ ఫేసియ‌ల్ ఎక్స్ ప్రెష‌న్స్ తో క‌ట్టి ప‌డేసాడు. చాటుగా క‌లిసేందుకు ఇష్టం లేక‌పోయినా అత‌డి ప్ర‌య‌త్నానికి చివరికి క‌రిగిపోయి ప్రియురాలు అతనికి ఆమోదం తెలిపింది.

శ్రీలీల సాంప్రదాయ చీర‌లో అద్భుతంగా కనిపించింది. ర‌వితేజ యూత్ ఫుల్ గా క‌నిపిస్తున్నాడు. రొమాంటిక్ గ్లింప్స్ యూత్ కి అంతే ఇదిగా క‌నెక్ట‌యిపోయింది. మొత్తానికి అదిరిపోయే రొమాన్స్ తో ర‌వితేజ మ‌రోసారి ర‌క్తి క‌ట్టించ‌బోతున్నాడ‌ని అర్థ‌మ‌వుతోంది. ఇది రొమాంటిక్ యాంగిల్ అనుకుంటే.. త్వరలో విడుదల కానున్న టీజర్ లో సినిమాలో మ‌రో కోణం ఏమిటో చూపించే వీలుంది.

పీపుల్స్ మీడియా ప‌తాకంపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మునుముందు ప్ర‌చారం ప‌రంగా మ‌రింత జోరు పెంచ‌నుంది టీమ్.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.