Begin typing your search above and press return to search.

ధ‌మాకా ట్రైల‌ర్: కోట్ల‌లో ఒక‌డాడు కొడితే కోలుకోలేవు!

By:  Tupaki Desk   |   15 Dec 2022 2:40 PM GMT
ధ‌మాకా ట్రైల‌ర్: కోట్ల‌లో ఒక‌డాడు కొడితే కోలుకోలేవు!
X
వైజాగ్ ఫ్యాక్ట‌రీలో 1000 మందికి ఉద్యోగాలివ్వాలి! .. ఇందులో చాలా కాన్సెప్ట్ కంటెంట్ క‌నిపిస్తోంది. ఈ ఒక్క డైలాగ్ తో మాస్ యాక్ష‌న్ `ధ‌మాకా` మోగించాడు రాజా! రవితేజ స్ట్రైక్స్ ఎగైన్! అనిపించే మ‌సాలా ఎంట‌ర్ టైనర్ తో బ‌రిలో దిగుతున్నాడ‌ని హింట్ అందింది. మాస్ మ‌హారాజ్ ర‌వితేజ‌ మరోసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఆయన రెండు విభిన్న షేడ్స్ ఉన్న‌ పాత్రల్లో నటిస్తున్న `ధమాకా` ట్రైలర్ తాజాగా విడుదలైంది. త్రినాధరావు నక్కిన ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. బెజవాడ ప్రసన్నకుమార్ ర‌చ‌యిత‌. ఈ జోడీ ప‌ర్ఫెక్ట్ మాస్ ఎంట‌ర్ టైన‌ర్ల‌తో వినోదాత్మ‌క కంటెంట్ ని వండి వార్చడంలో సుప్ర‌సిద్ధులు. `ధమాకా` మరో వినోదాత్మక చిత్రం అవుతుందని ట్రైలర్ చెబుతోంది. మాస్ రాజా బాడీ లాంగ్వేజ్ టింజ్ కి త‌గ్గ క‌థాంశంతో ఈ చిత్రం తెర‌కెక్కింది.

ఇందులో ఒక‌రు క్లాస్ మొరొక‌రు మాస్.. ఆ ఇద్ద‌రిలో ఎవ‌రు ఎంత వినోదం పంచుతార‌నేది తెర‌పైనే చూడాలి. ద్విపాత్రాభినయం కోసం రవితేజ రూపాల‌ను మార్చుకుని క‌నిపించిన తీరు ఆక‌ట్టుకుంది. ఇద్ద‌రిలో ఒక‌రు ఆహ్లాద‌క‌రంగా క‌నిపిస్తే.. ఇంకొక‌రు మాత్రం తుఫాన్ లా భీభ‌త్సం సృష్టించ‌డం ఖాయ‌మ‌ని ట్రైల‌ర్ చెబుతోంది.

అలాగే ఈ మూవీలో త్రినాథ‌రావ్ బ్రాండ్ డైలాగుల‌కు కొద‌వేమీ లేదు. కోట్ల‌లో ఒక‌డాడు కొడితే కోలుకోలేరు..! అంటూ సీరియ‌స్ డైలాగ్ ఓ వైపు.. త్రివిక్ర‌మ్ మీ చుట్ట‌మా స‌ర్.. ? అంటూ కామెడీ టింజ్ మ‌రోవైపు... ఇలా మాస్ ని మురిపించే డైలాగుల‌కు కొద‌వేమీ లేదు. ``నేను వెనుకున్న‌వాళ్లు చూసుకుని ముందుకొచ్చిన వాడిని కాదురోయ్.. వెన‌క ఎవ‌రూ లేక‌పోయినా ముందు రావొచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని!`` అంటూ భారీ ఎమోష‌న‌ల్ డైలాగులు ఆక‌ట్టుకున్నాయి.

ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. జైరామ్ -త‌నికెళ్ల భ‌ర‌ణి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ట్వంటీ ఏజ్ గాళ్ శ్రీ‌లీల‌ తో మాస్ రాజా రొమాన్స్ కూడా ట్రైల‌ర్ లో ఒక రేంజులో మురిపిస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చారు. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన `ధమాకా` డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.