Begin typing your search above and press return to search.

ధ‌మ్కీ బోయ్ డిజైన‌ర్ లుక్స్ కి గ‌గ్గోలు

By:  Tupaki Desk   |   1 Dec 2022 4:20 PM GMT
ధ‌మ్కీ బోయ్ డిజైన‌ర్ లుక్స్ కి గ‌గ్గోలు
X
ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో క్రియేటివిటీ హ‌ద్దులు దాటేస్తోంది. ఇటీవ‌లి కాలంలో తెలుగు సినిమా స్టార్ల ఫ్యాష‌న్ సెన్స్ అమాంతం మారిపోయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టైల్ కి ప‌ర్యాయ‌ప‌దంగా మారితే.. దానిని మ‌రో లెవ‌ల్ కి తీసుకెళ్ల‌డంలో  రౌడీ బోయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ స‌క్సెసయ్యాడు. బాలీవుడ్ ఎన‌ర్జిటిక్ హీరో ఫ్యాష‌నిస్టా ర‌ణ‌వీర్ సింగ్ ని దేవ‌ర‌కొండ చాలా వ‌ర‌కూ అనుక‌రిస్తున్నాడు. ఇక ఇప్పుడు చూస్తుండగానే ఫ‌ల‌క్ నుమా దాస్ కాస్తా ధ‌మ్కీ బోయ్ గా మారిపోయాడు. విశ్వ‌క్ సేన్ లుక్ అమాంతం మారిపోయింది.

తాజాగా రిలీజైన `దాస్ కా ధ‌మ్కీ` లిరిక‌ల్ సాంగ్ ప్ర‌క‌ట‌న‌ పోస్ట‌ర్ లో అత‌డి లుక్ యూనిక్ నెస్ తో ఆక‌ట్టుకుంది. విశ్వ‌క్ బాడీ లాంగ్వేజ్ కి త‌గ్గ‌ట్టే ఈ స్పెష‌ల్ డిజైన‌ర్ కాస్ట్యూమ్ ఆక‌ట్టుకుంటోంది. నియాన్ జిలుగుల లుంగీ పంచె.. పైన రెడ్ క‌ల‌ర్ ఫ్లోర‌ల్ ష‌ర్ట్ ధ‌రించి విశ్వ‌క్ చాలా స్పెష‌ల్ గా క‌నిపిస్తున్నాడు. ఆల్మోస్ట్ ప‌డిపోయిందే పిల్లా అంటూ టూ హాట్ గా క‌నిపిస్తున్న  నివేదా పెదురాజ్ తో రొమాన్స్ అద‌ర‌గొట్టేస్తున్నాడు.

పిక్క‌ల పైకి పొట్టి గౌను ధ‌రించిన నివేద అందం ఈ పోస్ట‌ర్ లో యూత్ కి కిక్కిస్తోంది. ఓవ‌రాల్ గా ధ‌మ్కీ బోయ్ పిల్ల‌ను ప‌డేయ‌డంలో స‌క్సెస‌యిన‌ట్టే క‌నిపిస్తోంది. ఈ పాట థియేట‌ర్ల‌లో ఆడియెన్ కి స్పెష‌ల్ ట్రీటిస్తుంద‌నే ఆశిద్దాం. అంత‌కంటే ముందే తెలుగు లిరిక‌ల్ వీడియో డిసెంబ‌ర్ 5న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.

దాసు ఫ్యాష‌న్ సెన్స్ మారిందే

2019లో `ఫలక్ నుమా దాస్` చిత్రంతో దర్శక‌ర‌చ‌యిత‌గా హీరోగా తన సత్తాను నిరూపించుకున్న టాలీవుడ్ ఆల్ రౌండ‌ర్ విశ్వక్ సేన్ ఇప్పుడు పాన్-ఇండియా మార్కెట్ పై క‌న్నేశాడు. అతడు తాజా చిత్రం `దాస్ కా ధమ్కీ`కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో విశ్వ‌క్ స్వ‌యంగా టైటిల్ పాత్రను కూడా పోషిస్తున్నాడు. ఈ చిత్రం ఫిబ్రవరి 2023లో తెలుగు- తమిళం- మలయాళం - హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇది  యాక్షన్ థ్రిల్లర్ షేడ్స్ తో తెర‌కెక్కిన‌ రోమ్-కామ్ మూవీ. ఇటీవ‌ల‌ విడుదలైన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో విశ్వక్ చెవిపోగులతోనే సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపించాడు.

విశ్వక్ సేన్ మళ్లీ మాస్ ని మెప్పించే యాక్షన్-ప్యాక్డ్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. `దాస్ కా ధమ్కీ`లో విశ్వక్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఒక గొప్ప పారిశ్రామికవేత్తగా.. రెస్టారెంట్ వెయిటర్ గా అత‌డు ఇచ్చే ధ‌మ్కీ ఏంటో తెర‌పైనే చూడాలి. సాంకేతిక బృందంలో సినిమాటోగ్రాఫర్ దినేష్ కె బాబు- మ్యూజిక్ కంపోజర్ లియోన్ జేమ్స్ -ఎడిటర్ అన్వర్ అలీ ఈ సినిమాకి ప్ర‌ధాన‌బ‌లం. హైపర్ ఆది- రంగస్థలం మహేష్- రావు రమేష్ - రోహిణి త‌దిత‌రులు ఇత‌ర కీల‌క‌ పాత్రలు పోషిస్తున్నారు. వన్మయే క్రియేషన్స్ - విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్ కథానాయికగా నటిస్తోంది. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి డైలాగ్స్ అందించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.