Begin typing your search above and press return to search.

ధమ్కీ.. అంచనాలకు తగినట్టే ఉంటుందన్న విశ్వక్ సేన్..!

By:  Tupaki Desk   |   19 Nov 2022 4:54 AM GMT
ధమ్కీ.. అంచనాలకు తగినట్టే ఉంటుందన్న విశ్వక్ సేన్..!
X
విశ్వక్ సేన్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దాస్ కా ధమ్కీ. ఫిబ్రవరిలో రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ప్రమోషన్స్ ని ఇప్పటినుంచే స్టార్ట్ చేశాడు విశ్వక్ సేన్. శుక్రవారం ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. నందమూరి బాలకృష్ణ ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు. బాలయ్య గురించి అందరు రకరకాలుగా అనుకుంటారు ఆయన కనిపించడం అలా గంభీరంగా ఉన్నా ఆయన చాలా స్వీట్ పర్సన్ అని అన్నారు విశ్వక్ సేన్.

ఫోన్ చేయగానే హాయ్ బ్రో అంటూ ఆప్యాయంగా పలుకరిస్తారని. ఇప్పుడు కూడా తన కారులో ఆయన్ని తీసుకొచ్చానని. నా ఫ్రెండ్స్ నమ్మట్లేదని స్పీకర్ ఆన్ చేసి మరీ బాలకృష్ణ సర్ తో మాట్లాడానని అన్నారు విశ్వక్ సేన్.

ఇక సినిమా గురించి చెబుతూ తన డైరక్షన్ లో వస్తున్న సెకండ్ సినిమా ఇది. ఫలక్ నుమా దాస్ టైం లో బడ్జెట్ కోసం ఇబ్బందులు పడ్డాం.. కానీ ఈ సినిమా మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా తీశామని అన్నారు.

అంతేకాదు సినిమా తప్పకుండా మీ అందరిని అలరిస్తుందని ప్రేక్షకులను ఉద్దేశించి అన్నారు విశ్వక్ సేన్. ఈ సినిమా కోసం ఏడాది పాటు మరే సినిమా చేయలేదని. ధమ్కీ కోసం చాలా కష్టపడ్డానని అన్నారు విశ్వక్ సేన్. ధమ్కీ ట్రైలర్ చూస్తేనే విశ్వక్ సేన్ కష్టం అర్ధమవుతుంది.

రీసెంట్ గా ఓరి దేవుడా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్ ఈసారి ధమ్కీ అంటూ బాక్సాఫీస్ దగ్గర తన సత్తా చాటనున్నారు. తన ప్రతి సినిమా విషయంలో ఏదో ఒక గొడవతో వార్తల్లో నిలిచే విశ్వక్ సేన్ రీసెంట్ గా అర్జున్ సినిమా నుంచి బయటకు వచ్చి మళ్లీ న్యూస్ లో హైలెట్ అయ్యాడు. మొత్తానికి ఓ పక్క హీరోగా చేస్తూనే డైరక్టర్ గా విశ్వక్ సేన్ తన టాలెంట్ చూపిస్తున్నాడు. ఫలక్ నుమా దాస్ తో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న విశ్వక్ సేన్ ధమ్కీతో మరోసారి తన మార్క్ చూపించాలని ఫిక్స్ అయ్యాడు.

ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా ట్రైలర్ చూస్తే గోపీచంద్ గౌతం నంద మూవీ కి దగ్గర పోలికలు ఉన్నాయని తెలుస్తుంది. విశ్వక్ సేన్ ఇందులో డబుల్ యాక్షన్ చేస్తున్నారు. తప్పకుండా విశ్వక్ సేన్ కి ఈ సినిమా మంచి హిట్ ఇవ్వాలని ఆశిస్తున్నారు మాస్ కా దాస్ ఫ్యాన్స్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.