Begin typing your search above and press return to search.
రజనీ ఇంట జరిగిన దీపావళి వేడుక క్లారిటీ ఇచ్చేసిందా?
By: Tupaki Desk | 25 Oct 2022 5:30 PM GMTతమిళ ఇండస్ట్రీలో విభిన్నమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన హీరో ధనుష్. తనదైన మార్కు సినిమాలతో కోలీవుడ్ టు హాలీవుడ్ వరకు వెళ్లిన ధనుష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ యమ బిజీగా వున్నాడు. ఇదే ఏడాది తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్ లో `సార్` మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. సితార ఎంటర్ టైన్ మెంట్స్ తో పాటు ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
తమిళంలో `వాతి` అనే పేరుతో రూపొందుతున్న ఈ మూవీలో `భీమ్లానాయక్` ఫేమ్ సంయుక్త మీనన్ నటిస్తోంది. ఈ మూవీని డిసెంబర్ కు రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నా ప్రస్తుత పరిస్థితులని బట్టి అది సాధ్యం కావడం కష్టమని చెబుతున్నారు. ఇదిలా వుంటే ధనుష్ - ఐశ్వర్యలు ఇటీవల విడిపోతున్నామంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. 17 ఏళ్ల వైవాహిక జీవితానికి గుడ్ బై చెబుతూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం పలువురిని షాక్ కు గురిచేసింది.
అయితే ఈ ప్రకటనపై కలత చెందిన రజనీకాంత్ విడాకులు తీసుకుని విడిపోవడం మంచిది కాదంటూ ఇద్దరికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారని, ఈ నేపథ్యంలో ఇద్దరు మళ్లీ కలవబోతున్నారని తమిళనాట ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఐశ్వర్యా, ధనుష్ కలిసి ప్రైవేట్ పార్టీలకు హాజరు కాడంతో విడాకులంతా తూచ్ అని, రజనీ కోరిక మేరకు ఐశ్వర్య, ధనుష్ మళ్లీ కలిసి ప్రయాణం చేయబోతున్నారని అంతా భావించారు.
ఇద్దరు కలిసి మళ్లీ తమ వైవాహిక జీవితాన్ని ఎప్పటిలాగే తిరిగి ప్రారంభిస్తారని, దీని కోసం రజనీకాంత్ చాలా రోజులుగా చర్చలు జరుపుతున్నారని, ధనుష్ తండ్రి కస్తూరి రాజా కూడా ఈ ఇద్దరు విడిపోరని, అలా విడిపోయి వుండలేరని స్టేట్మెంట్ ఇవ్వడంతో అంతా ఇది నిజమే అనుకున్నారు. అయితే ధనుష్, ఐశ్మర్యలు మళ్లీ కలవడంపై రజనీ ఇంట జరిగిన దీపావళి ఫెస్టివల్ క్లారిటీ ఇచ్చేసింది. దీపావళి సెలబ్రేషన్స్ ని రజనీ కుటుంబ సభ్యులతో జరుపుకున్నారు.
అయితే ఈ సెలబ్రేషన్స్ లో ఐశ్కర్య, పిల్లలు కనిపించినా ధనుష్ మాత్రం కనిపించకపోవడంతో ధనుష్ - ఐశ్వర్య మళ్లీ కలవడంపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ వచ్చేసిందని కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. నెటిజన్ లు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఐశ్వర్యతో కలవని వుంటే రజనీ ఇంట జరిగిన దీపావళి సెలబ్రేషన్స్ లో ధనుష్ పాల్గొనే వాడని, కానీ అతనికి కలవాలనే ఉద్దేశ్యం లేదు కాబట్టే హాజరు కాలేదని కామెంట్ లు చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.