Begin typing your search above and press return to search.
షాకింగ్ ట్విస్టు: ధనుష్- ఐశ్వర్య విడాకులు రద్దు!
By: Tupaki Desk | 2 Oct 2022 5:36 AM GMTమాటల్లేవ్ మాట్లాడుకోడాల్లేవ్ అనుకుంటేనే సమస్య! మాట్లాడితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. అందుకు ఇది తాజా ఉదాహరణ. మేం విడాకులు తీసుకుంటున్నాం! అంటూ కొద్ది రోజుల క్రితం స్టార్ హీరో ధనుష్ ఆయన భార్య ఐశ్వర్య సంయుక్త ప్రకటనలో వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటనతో ధనుష్ అభిమానులు పెద్ద షాక్ తిన్నారు.
ఈ ఏడాది ప్రారంభంలోనే ధనుష్- ఐశ్వర్య విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. 18 ఏళ్లు కలిసి జీవించి ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యాక ఈ నిర్ణయం అందరినీ బాధించింది. విడిపోయిన తర్వాత సోషల్ మీడియాలో తమ పేర్లను మార్చుకుని కలిసి ఉన్న ఫొటోలను తొలగించారు. దీంతో మళ్లీ కలవడం లేదని అంతా ఫిక్స్ అయ్యారు. రీసెంట్ గా స్కూల్ లో జరిగిన ఓ ఫంక్షన్ కి వాళ్ల పిల్లల కోసం కలిసి హాజరవ్వగా.. ఫొటోలు వైరల్ అయ్యాయి.
ఇది చూశాక ఈ జంట యథావిధిగా కలిసి ఉంటే బాగుంటుందని వారి అభిమానులు ఆకాంక్షించారు. ధనుష్ తండ్రి కూడా ఓ సందర్భంలో తమ మధ్య చిన్న గొడవలే ఉన్నాయని వారు కలిసిపోతారని చెప్పారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఆయన కోరిందే జరిగింది. పెద్దలు సమస్యను పరిష్కరించారు. దీంతో ఈ జంట విడాకుల ప్రతిపాదనను విరమించుకుంటున్నట్లు తెలుస్తోంది. రజనీకాంత్.. ఆమె కుటుంబ పెద్దల సమక్షంలో జరిగిన చర్చల్లో పెద్దల మాటలను గౌరవిస్తూ సానుకూల నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
అనునిత్యం ఈ కలతల వార్తలేనా?
కలిసి సంతోషంగా జీవించలేకపోతే విడాకులు తీసుకోవడం చూస్తున్నదే. సోషల్ మీడియా యుగంలో అలాంటివి ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. కానీ డిజిటల్ మీడియా అందుబాటులో లేని రోజుల్లో చాలా మంది సెలబ్రిటీలు విడాకులు తీసుకుని రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్నా తెలిసేవి కావు. ఇప్పుడు ప్రతిదీ క్షణాల్లోనే వైరల్ గా మారుతోంది. సెలబ్రిటీల బెడ్ రూమ్ విషయాలను కూడా ఇది బహిర్గతం చేసేంతగా మారిపోయింది. సెలబ్రిటీల ఇండ్లలో విషయాలేవీ దాగని పరిస్థితి. దీనికి సెన్సార్ షిప్ అన్నదే లేకపోవడం కూడా ఇప్పుడు సమస్యాత్మకంగా మారింది.