Begin typing your search above and press return to search.

కొలవెరిడీ కాంబో విభేదాలు తొలగిపోయాయి

By:  Tupaki Desk   |   16 Oct 2020 6:45 AM GMT
కొలవెరిడీ కాంబో విభేదాలు తొలగిపోయాయి
X
2011లో తమిళనాట వచ్చిన వై దిస్ కొలవెరిడీ సాంగ్‌ దేశ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ ను దక్కించుకుంది. అప్పట్లో ఈ పాట దేశ వ్యాప్తంగా యువతను ఉర్రూతలూగించింది. ఆ పాట ఎందుకు అంతగా సక్సెస్‌ అయ్యిందో ఎవరు కూడా చెప్పలేక పోయారు. ధనుష్‌ హీరోగా శృతి హాసన్‌ హీరోయిన్‌ గా నటించిన '3' సినిమాలోని పాట అది. 2012లో వచ్చిన ఆ సినిమా నిరాశ పర్చింది. ఆ పాటను అనిరుథ్‌ సంగీత సారథ్యంలో హీరో అయిన ధనుష్‌ స్వయంగా పాడాడు. పాట సూపర్‌ హిట్‌ అవ్వడంతో ఇద్దరి కాంబోకు మంచి పేరు వచ్చింది. కారణం ఏంటో కాని 2015 'మారి' సినిమా తర్వాత మళ్లీ వీరిద్దరు కలిసి వర్క్‌ చేయలేదు.

వీరి మద్య విభేదాలు ఉన్నాయంటూ తమిళ మీడియాలో పలు సార్లు వార్తలు వచ్చాయి. ఆ విషయమై ఇద్దరు కూడా స్పందించలేదు. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోక పోవడంతో ఏదో గొడవ అయితే ఉందని అంతా బలంగా నమ్మారు. దాదాపు అయిదు సంవత్సరాల తర్వాత వీరిద్దరు మళ్లీ ఒక సినిమా కోసం కలవబోతున్నారు. ఈ అయిదేళ విరామానికి వీరు స్వస్థి పలికి మళ్లీ కొలవెరిడీ కాంబో సెట్‌ చేయబోతున్నారు. సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ లో రాబోతున్న ఒక ప్రాజెక్ట్‌ లో వీరిద్దరి కాంబో ను ప్రేక్షకులు మళ్లీ చూడబోతున్నారు.. వినబోతున్నారు. ఇద్దరి మద్య విభేదాలు తొలగి పోయాయి అనే వార్త ప్రస్తుతం కొలవెరిడీ అభిమానులకు ఆనందం కలిగిస్తుంది.