Begin typing your search above and press return to search.
కర్ణుడిగా స్టార్ హీరో.. ఏంటా కథాకమామీషు!
By: Tupaki Desk | 30 Jan 2021 12:15 PM ISTకర్ణుడు అనగానే దానధర్మాలు గుర్తుకు వస్తాయి. విలేజీలో దానం చేసే కుర్రాడిని దానకర్ణుడు అని పొగిడేస్తారు. ఉన్నవన్నీ దానమిచ్చి చివరికి అన్నీ అడుగంటి రోడ్డున పడే వారిని తెలివితక్కువ కర్ణుడు అని కూడా తిట్టేస్తుంటారు. అయితే ఇంతకీ ఈ దాన కర్ణుడి కథేమిటి? స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న `కర్ణన్` కథాకమామీషు ఏమై ఉంటుంది? అంటే.. దానికి జవాబు ఇచ్చేందుకు టీమ్ సిద్ధమవుతోంది.
కొన్ని రోజుల క్రితం ధనుష్ తదుపరి చిత్రం `కర్ణన్` కి సంగీతం అందిస్తున్న సంతోష్ నారాయణన్ ట్విట్టర్లో కొన్ని ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ధనుష్ హీరోగా మారి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని తాను చూశానని.. బాగా ఆకట్టుకుందని అతడు చెప్పారు. తాజాగా కర్ణన్ పై పెద్ద సంగతి చెబుతామని మేకర్స్ ప్రకటించారు. నూతన సంవత్సరంలో వాగ్దానం చేసినట్లు ఈ చిత్రం నుండి ధనుష్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేస్తారని భావిస్తున్నారు.
కర్ణన్ పూర్తిగా విలేజీ డ్రామా. కొత్త సంవత్సరంలో అడుగుపెట్టే వేళ రిలీజ్ చేసిన పోస్టర్ లో ధనుష్ చేతిలో కత్తితో గుర్రపు స్వారీ చేస్తున్న వైనం ఆకట్టుకుంది. అది ప్రీలుక్ మాత్రమే. తదుపరి ధనుష్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను త్వరలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ఇక ఈ చిత్రంలో రాజీషా విజయన్ కథానాయిక. `పరియరం పెరుమాల్` తర్వాత దర్శకుడు ఎంతో ఛాలెంజింగ్ గా కర్ణన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో 96 ఫేమ్ గౌరీ కిషన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. పాపులర్ మోలీవుడ్ స్టార్ లాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇదిలావుండగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో ధనుష్ కల్ట్ క్లాసిక్ చిత్రాన్ని చేస్తున్నారు. `ఆయిరథిల్ ఒరువన్` రీమేక్ ఇది. అలాగే దర్శకుడు కార్తీక్ నరేన్ తో కలిసి ఇంకా టైటిల్ నిర్ణయించని చిత్రం కూడా చేస్తున్నారు. ఇందులో మాళవికా మోహనన్ కథానాయిక.