Begin typing your search above and press return to search.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ 'సార్'..!
By: Tupaki Desk | 23 Dec 2021 5:24 AM GMTజాతీయ అవార్డ్ విన్నింగ్ యాక్టర్, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు తెలుగులో భారీ ఫాలోయింగ్ ఉంది. విలక్షణ నటుడి తమిళ్ సినిమాలన్నీ తెలుగులోనూ డబ్ కాబడి మంచి విజయాలను అందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు స్ట్రెయిట్ తెలుగు మూవీ చేయడానికి రెడీ అయ్యారు. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు తమిళ బైలింగ్విల్ సినిమాలో ధనుష్ హీరోగా నటిస్తున్నారు.
ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఒక సామాన్యుడి ప్రతిష్టాత్మక మరియు హృదయపూర్వక ప్రయాణం అంటూ మేకర్స్ ఈరోజు గురువారం ఈ సినిమా టైటిల్ ను ప్రకటించారు. ఈ చిత్రానికి ''సార్'' (SIR) అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేశారు. తమిళ్ లో 'వాతి' పేరుతో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
'సార్' సినిమాలో ధనుష్ ఒక లెక్చరర్ గా నటిస్తున్నట్లు సూచించే టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియోని చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఓ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పరిసరాలను చూపిస్తూ.. క్లాస్ రూమ్ లోని బ్లాక్ బోర్డ్ మీద టైటిల్ ను రివీల్ చేశారు. టైటిల్ లోగో ధనుష్ పాత్రను సూచిస్తూ ‘i’ అనే అక్షరంతో పెన్నులా డిజైన్ చేయబడింది.
ధనుష్ నటిస్తున్న ఈ ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు సినిమా మన దేశంలోని విద్యావ్యవస్థ గురించి చర్చిస్తుందని తెలుస్తోంది. ఇందులో లెక్చరర్ పాత్రలో ధనుష్ కనిపించడం ఆసక్తికరం. టైటిల్ రివీల్ వీడియోలోని అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ అతని పాత్రకు అన్ని ఎలివేషన్స్ ఇస్తోంది. 'సార్' చిత్రంలో ధనుష్ సరసన సంయుక్త హీరోయిన్ గా కనిపించనుంది.
తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉన్న తమిళ నటులలో ధనుష్ ఒకరు. టాలీవుడ్ అరంగేట్రం చేయడానికి సరైన స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో వెంకీ అట్లూరి చెప్పిన కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఇప్పటి వరకు 'తొలిప్రేమ' 'మిస్టర్ మజ్ను' 'రంగ్ దే' వంటి ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు డైరెక్ట్ చేసిన వెంకీ అట్లూరి.. ఇప్పుడు తన స్టైల్ ని మార్చుకుని ఒక యూనిక్ అండ్ కమర్షియల్ సబ్జెక్ట్ తో ''సార్'' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
'SIR' చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగ వంశీ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం చాలా టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. దినేష్ కృష్ణన్.బి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్ గా.. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ర్ గా వర్క్ చేయనున్నారు.
'సార్' తరగతులు త్వరలో ప్రారంభమవుతాయని.. అంటే 2022 జనవరి నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడి కానున్నాయి.
ఇకపోతే ధనుష్ ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ మల్టీలాంగ్వేజ్ మూవీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ''సార్'' సినిమా తర్వాతే సెన్సిబుల్ డైరెక్టర్ ప్రాజెక్ట్ ఉంటుందని తెలుస్తోంది. తన ఫస్ట్ డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ అంటూ ధనుష్ ట్వీట్ చేయడంతో దీనిపై క్లారిటీ వచ్చేసింది. మరి ఇన్నాళ్లూ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ధనుష్.. స్ట్రెయిట్ మూవీతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.