Begin typing your search above and press return to search.
టాప్ గేర్ లో ధనుష్.. పారితోషికం ఎంతో తెలుసా?
By: Tupaki Desk | 27 Jun 2021 11:30 PM GMT‘‘ఇతను హీరోనా..? రజనీకాంత్ అల్లుడు కాబట్టే.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ పాస్ దొరికింది..’’ ఇదీ.. పదేళ్ల కిందట ఇండస్ట్రీలోకి ప్రవేశించినప్పుడు వినిపించిన మాటలు. కానీ.. ఇప్పుడు లెక్క వేరే. ధనుష్ అంటే ఒక బ్రాండ్. అతన్నుంచి సినిమా వస్తోందంటే.. ఖచ్చితంగా దాని ‘కథ’ వేరే ఉంటదనే ఓ నమ్మకం ప్రేక్షకుల్లో క్రియేట్ అయ్యిందంటే అతిశయోక్తి కాదు. అంతలా ఆడియన్స్ ధనుష్ ను ఓన్ చేసుకున్నారు. ఆయన్నుంచి వచ్చిన సినిమాలే ఈ విషయాన్ని చెబుతాయి.
రఘువరన్ బీటెక్ వంటి సినిమాలో కాలేజీ కుర్రవాడిలా నటించినా.. ‘అసురన్’ చిత్రంలో వయసు మళ్లిన దళితుడిగా కనిపించినా.. కర్ణన్ సినిమాలో పోరాట యోధుడిగా వీరత్వం ప్రదర్శించినా.. ధనుష్ కే చెల్లింది. ఇప్పుడు ధనుష్ అంటే రజనీకాంత్ అల్లుడు మాత్రమే కాదు. కోలీవుడ్ లో స్టార్ హీరో. స్టోరీ సెలక్షన్ మూస ధోరణిలో కాకుండా.. వైవిధ్యంగా ఉండాలని కోరుకోవడం.. స్టార్ డమ్ వంటి చట్రంలో ఇరుక్కుపోకుండా ముందుకు సాగడమే అతని విజయ రహస్యం అంటారు. అసురన్ సినిమాలో నడిబజారులో సాష్టాంగ నమస్కారం చేస్తూ ఇతరుల కాళ్లు పట్టుకునే పాత్రలో ధనుష్ జీవించిన తీరు.. అతని నటనా పటిమకు అద్దం పడుతుంది.
ఇలా.. ఇంతింతై అన్నట్టుగా ఎదిగిన ధనుష్.. ఇప్పుడు తమిళ నాట స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. ఆయన సక్సెస్ రేటుతోపాటు రెమ్యునరేషన్ కూడా పెరిగిపోతోంది. అయితే.. కథ నచ్చి, నిర్మాతలు దొరక్కపోతే.. తానే స్వయంగా నిర్మించి, సత్తా చాటిన సినిమాలు కూడా ఉన్నాయి. రజనీ హిట్ మూవీ ‘కాలా’ ధనుష్ నిర్మించిందే కావడం గమనార్హం.
కోలీవుడ్ నుంచి మొదలైన ధనుష్ ప్రస్థానం అంతర్జాతీయ స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఓ హాలీవుడ్ లో ధనుష్ నటిస్తున్నాడు. ఇప్పుడు ఆ చిత్రం కోసం అమెరికాలోనే ఉన్నాడీ హీరో. త్వరలో తెలుగులో కూడా స్ట్రయిట్ చిత్రం రాబోతోందనే వార్తలు వస్తున్నాయి. ఇలా అంచెలంచెలు ఎదుగుతున్న ధనుష్.. త్వరలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించబోతున్నాడు. ఇందుకోసం రూ.30 కోట్ల పైనే రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడట. రాబోయే రోజుల్లో ధనుష్ స్టార్ డమ్ ఏ స్థాయికి చేరుతుందో చూడాలి.