Begin typing your search above and press return to search.

గుస‌గుస‌: ర‌చ‌యిత‌గా మారిన స్టార్ హీరో

By:  Tupaki Desk   |   27 Aug 2021 8:30 AM GMT
గుస‌గుస‌: ర‌చ‌యిత‌గా మారిన స్టార్ హీరో
X
కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ మ‌ల్టీ ట్యాలెంట్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. అత‌డు జాతీయ ఉత్త‌మ‌ న‌టుడే కాదు మంచి గాయ‌కుడు.. ర‌చ‌యిత కూడా. ఇంత‌కుముందు కొల‌వ‌రి డి పాట‌తో అత‌డు మెస్మరైజ్ చేశాడు. అలాగే త‌న సినిమాల‌ స్క్రిప్ట్ విష‌యంలో రైట‌ర్ల‌కు అత్యంత విలువైన‌ సూచ‌న‌లు.. స‌ల‌హాలు ఇస్తుంటారు. త‌న టేస్ట్ కు అనుగుణంగా క‌థ‌ల్ని రాయించుకుంటారు. అవ‌సర‌మైతే తానే పెన్ను ప‌ట్టుకుని ర‌చ‌న‌లు చేయ‌గ‌ల‌డు. డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ గా... సింగ‌ర్ గా కూడా ధ‌నుష్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మే. అయితే ఈ సారి ఏకంగా త‌న సినిమాకు తానే స్క్రీన్ ప్లే... సంభాష‌ణ‌లు రాసుకోవ‌డం విశేషం. ధ‌నుష్ క‌థానాయకుడిగా జ‌వ‌హార్ మిత్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో `తిరుచ్చిట్ర‌మ్ బ‌లం` అనే ఓ చిత్రం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. స‌న్ పిక్చర్స్ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ప్ర‌స్తుతం ఇది సెట్స్ లో ఉంది.

అయితే ఈ సినిమాకు తానే క‌థ‌నం. .మాట‌లు రాస్తాన‌ని నేరుగా ధ‌నుష్ రంగంలోకి దిగిన‌ట్లు తెలిసింది. మ‌రి ఆల్రెడీ రాసిన క‌థ‌నం.. మాట‌లు న‌చ్చ‌కపోవ‌డం వ‌ల్ల‌నే ఇలా ధ‌నుష్ పెన్ను ప‌ట్టారా? లేక ముందుగానే ద‌ర్శ‌కుడితో ఆ ర‌కంగా అగ్రిమెంట్ చేసుకున్నాడా? అన్న‌ది తెలియాల్సి ఉంది. ఇప్ప‌టివ‌ర‌కూ ధ‌నుష్ చాలా సినిమాల‌కు ర‌చ‌నా స‌హ‌కారం అందించారు. కానీ ఇప్పుడు నేరుగా టైటిల్ కార్డులోనే ర‌చ‌యిత‌గా ధ‌నుష్ పేరు బ‌య‌ట‌కు రావ‌డం ఇదే తొలిసారి అవుతుంది. ధ‌నుష్ లో పూర్తి స్థాయిలో రైటింగ్ యాంగిల్ ని కూడా బ‌య‌ట‌కు తెచ్చే అవ‌కాశం క‌నిపిస్తుంది.

ఇందులో ధ‌నుష్ స‌ర‌స‌న నిత్యామీన‌న్- రాశీఖ‌న్నా.. ప్రియా భ‌వానీ శంక‌ర్ న‌టిస్తున్నారు. భార‌తీరాజా.. ప్ర‌కాష్ రాజ్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిస్తున్నారు. గ‌తంలో అనిరుధ్ సంగీతం అందించిన `కొల‌వెరీడీ` పాట‌ను ధ‌నుష్ ఆల‌పించిన సంగ‌తి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ పాట ధ‌నుష్ కి గాయ‌కుడిగా మంచి పేరు తీసుకొచ్చింది. మ‌రి ఈ సినిమా ప్ర‌చార ద‌శ‌లో ధ‌నుష్ అలాంటి ప్ర‌య‌త్నం మ‌ళ్లీ చేస్తారేమో చూడాలి. ఇక ధ‌నుష్ శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ తెలుగు సినిమాకు స‌న్నాహాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

క‌మ్ముల‌తో మ‌ద్రాస్ నేప‌థ్యంలో చిత్రం:

త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ -క‌మ్ముల కాంబినేష‌న్ మూవీ తెలుగు- త‌మిళ్ రెండు భాష‌ల్లోనూ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఈ రేర్ కాంబినేష‌న్ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన‌ప్ప‌టి నుంచి భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. శేఖ‌ర్ క‌మ్ముల ఎలాంటి క‌థాంశంతో ధ‌నుష్ ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయ‌బోతున్నారు? అనే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. శేఖ‌ర్ క‌మ్ముల అంటే ఎమోష‌న్.. ల‌వ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో సినిమాలు తీస్తారు. సున్నిత‌మైన ఉద్వేగాల‌ను త‌న‌దైన శైలిలో తెర‌కెక్కిస్తుంటారు. మ‌ళ్లీ అలాంటి స‌క్సెస్ ఫుల్ ఎలిమెంట్ తోనే వస్తున్నారా? అంటే కానే కాద‌ని తెలిసింది.

మ‌ద్రాసు రాజ‌ధాని పాల‌న‌లో క‌లిసి ఉన్న తెలుగు- త‌మిళ రాష్ట్రాల క‌థ‌ను ఎంపిక చేసుకుని స్క్రిప్టుని రాస్తున్నట్లు ప్ర‌చారం సాగింది. టూస్టేట్స్ -పాలిటిక్స్ రిలేటెడ్ టాపిక్ అని.. నాటి రోజుల్లో త‌మిళ- తెలుగు ప్ర‌జ‌ల స్నేహం స‌హా భావోద్వేగాల‌ను తెర‌పై ఆవిష్క‌రించ‌నున్నార‌నే ప్ర‌చారం గ‌ట్టిగానే సాగుతోంది. ఈ నేప‌థ్యంలో మ‌రో స‌రి కొత్త అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. శేఖ‌ర్ క‌మ్ముల ఈ సారి ఎమోష‌న్స్ కంటే.. పొలిటిక‌ల్ ట‌చ్ ఉన్న క‌థాంశంపై ఫోక‌స్ చేసార‌ని కూడా కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది. మ‌రి ఇందులో నిజ‌మెంతో తేలాల్సి ఉంటుంది. లీడ‌ర్ త‌ర్వాత మ‌ళ్లీ పొలిటిక‌ల్ నేప‌థ్యం ఉన్న స్క్రిప్టుతో క‌మ్ముల ప్ర‌యోగం చేస్తార‌నే అభిమానులు భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏషియ‌న్ నారంగ్ త‌న భాగ‌స్వాముల‌తో క‌లిసి నిర్మిస్తున్నారు.

శేఖ‌ర్ క‌మ్ముల‌ చిత్రానికి ముందే ధ‌నుష్ ఓ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం చేయనున్నారని ఈ చిత్రాన్ని సితారా ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తుంద‌ని కూడా ప్ర‌చారం ఉంది. దీనికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తార‌ని స‌మాచారం. ఇంకా ప్రకటించని ఈ మూవీ షూటింగ్ ఏడాది చివరిలో ప్రారంభం కానుంది. ఈ చిత్రం ఎడ్యుకేషన్ మాఫియా చుట్టూ తిరిగే సోషియో పొలిటిక‌ల్ డ్రామా.. విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక యువకుడు చేసిన పోరాటాన్ని చూపించ‌నున్నారు. అటు కోలీవుడ్ బాలీవుడ్ లోనూ ధ‌నుష్ బిజీ. కార్తీక్ నరేన్ దర్శకత్వంలో `డి 43` షూటింగ్ జ‌రుగుతోంది. బాలీవుడ్ చిత్రం `అట్రాంగి రే` హాలీవుడ్ చిత్రం `ది గ్రే మ్యాన్` షూటింగ్ ల‌ను ధ‌నుష్ పూర్తి చేసాడు. అన్న‌య్య‌ సెల్వరాఘవన్ తో కలిసి `నాన్ వరువెన్` కోసం ప‌ని చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఆగస్టు 20 న ప్రారంభం కానుంది.