Begin typing your search above and press return to search.
స్టార్ హీరో మోస్ట్ వెయిటెడ్ మూవీ షురూ
By: Tupaki Desk | 8 Jan 2021 3:21 PM ISTతమిళ స్టార్ హీరో ధనుష్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఒక వైపు తమిళంలో సినిమాలు చేస్తున్న ధనుష్ మరో వైపు బాలీవుడ్ మరియు హాలీవుడ్ ప్రాజెక్ట్ లను కూడా చేస్తున్నాడు. తాజాగా ఈయన హాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఇక ధనుష్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'డి43' సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది. ఈ సినిమా ధనుష్ కు చాలా ప్రత్యేకంగా ఉంటుందని దీన్ని ఒక విభిన్నమైన కమర్షియల్ మూవీగా దర్శకుడు కార్తిక్ నరేష్ రూపొందించబోతున్నారు.
సినిమా కథ థ్రిల్లింగ్ గా ఉంటుందని ధనుష్ నుండి అభిమానులు ఏం అయితే ఆశిస్తున్నారో అది ఈ సినిమా ద్వారా అందుకుంటారు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకంగా చెబుతున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభించడంతో ఇదే ఏడాది సినిమా వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇక ఈ సినిమాలో ఒక పాట రౌడీ బేబీ రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తతోంది. జీవీ ప్రకాష్ ఒక మాస్ మసాలా పాటను ట్యూన్ చేస్తున్నారని దానికి జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించబోతున్నట్లుగా తెలుస్తోంది. షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం అవ్వడంతో రెగ్యులర్ షూటింగ్ కూడా వెంటనే ప్రారంభించబోతున్నారు.