Begin typing your search above and press return to search.
ధనుష్ గొప్ప పని చేశాడబ్బా..
By: Tupaki Desk | 3 Aug 2017 11:37 AM GMTతమిళ స్టార్ హీరో ధనుష్ కొంత కాలంగా నెగెటివ్ వార్తలతోనే హైలైట్ అవుతున్నాడు. సుచీ లీక్స్ వ్యవహారం.. అతను ఎవరి కొడుకనే విషయంలో తలెత్తిన వివాదం.. అలాగే ఓ తెలుగు టీవీ ఛానెల్ వాళ్లు అడిగిన ప్రశ్నలపై ఆగ్రహంతో వాకౌట్ చేసి వెళ్లిపోవడం.. ఇలాంటి వార్తలు అతడి ఇమేజ్ ను డ్యామేజ్ చేశాయి. ఐతే అతనిప్పుడు ఓ మంచి పనితో వార్తల్లోకి వచ్చాడు. తమిళనాట అప్పుల బాధతో.. అనారోగ్యంతో ప్రాణాలు విడిచిన రైతుల కుటుంబాల్ని ఆదుకోవడానికి ధనుష్ ముందుకొచ్చాడు.
తమిళనాడు తేని జిల్లాలోని శంకరాపురం గ్రామం ధనుష్ తల్లికి స్వస్థలం. ఆ ఊర్లో ధనుష్ కుటుంబానికి కుల దైవమైన కరుప్పస్వామి ఆలయం కూడా ఉంది. ఏటా తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి వెళ్లడం ధనుష్ కు అలవాటు. ఈసారి కూడా భార్య ఐశ్వర్యతో పాటు తల్లిదండ్రులు.. పిల్లల్ని వెంట బెట్టుకుని అక్కడికి వెళ్లాడు ధనుష్. ఐతే వెళ్లే ముందే అక్కడ ఆత్మహత్యలు చేసుకున్న.. అనారోగ్యంతో చనిపోయిన రైతుల కుటుంబాల్ని ఆదుకోవడానికి సన్నాహాలు చేసుకున్నాడు.
మొత్తం 250 మంది రైతుల కుటుంబాల్ని ఆదుకోవాలని నిర్ణయించుకున్న ధనుష్.. ముందుగా తొలి విడతగా 125 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాడు. ఒక్కో కుటుంబానికి రూ.50 వేల చొప్పున అతను అందజేశాడు. ఇలా తొలి విడతలో రూ.63 లక్షల దాకా డబ్బు పంచి పెట్టాడు. మరో విడతలో మిగతా 125 కుటుంబాలకు ఆర్థిక సాయం చేయనున్నాడు ధనుష్. అన్నం పెట్టే రైతులు వివిధ కారణాలతో ఆత్మహత్యలు చేసుకోవడం తనను కలచి వేస్తోందని.. వారికి తన వంతుగా సాయం అందించాలని నిర్ణయించుకున్నానని ధనుష్ తెలిపాడు.