Begin typing your search above and press return to search.

విషాదంలో స్టార్‌ హీరో

By:  Tupaki Desk   |   7 Nov 2020 6:30 AM GMT
విషాదంలో స్టార్‌ హీరో
X
తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ తన వీరాభిమాని దినేష్‌ కుమార్‌ మృతి చెందడంతో భావోద్వేగంకు గురి అయ్యాడు. చాలా కాలంగా ధనుష్‌ అంటే పిచ్చి అభిమానంను ప్రదర్శిస్తూ ఈరోడ్‌ జిల్లా ధనుష్‌ వెల్ఫేర్‌ అసోషియేషన్‌ ను రన్‌ చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించాడు. ధనుష్‌ కు మంచి పేరు తెచ్చేలా ఎన్నో సేవా కార్యక్రమాలను చేసిన దినేష్‌ ఇటీవల అనారోగ్యం పాలయ్యాడు. ఆయన ఆరోగ్యం మరింత విషమించి మృతి చెందాడు. దినేష్‌ మృతి విషయం తెలిసి తీవ్ర దిగ్ర్బాంతిని వ్యక్తం చేసిన ధనుష్‌ ఆయన కుటుంబ సభ్యులతో వెంటనే ఫోన్‌ లో మాట్లాడి వారిని పరామర్శించాడు.

దినేష్‌ అంత్య క్రియలకు సంబంధించి ఈరోడ్‌ జిల్లా తన ఫ్యాన్స్‌ ను ఆదేశించారు. ఈరోడ్‌ ధనుష్‌ అభిమాన సంఘం కార్యదర్శిగా ఉన్న దినేష్‌ మృతి పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ధనుష్‌ అభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. నా అభిమాని మృతి నాకు తీవ్ర ఆవేదన కలిగించింది. నాతో పాటు నా కుటుంబ సభ్యులకు కూడా ఆయన మృతి విషాదంను మిగిల్చిందని అంటూ ట్వీట్‌ చేశాడు. అభిమాని మృతి పట్ల ఇంతగా స్పందిస్తున్న ధనుష్‌ తీరుకు నెటిజన్స్‌ అభినందనలు వ్యక్తం చేస్తున్నారు.