Begin typing your search above and press return to search.

ధనుష్-శింబు ఫ్యాన్స్ పంచాయితీ.. సోషల్ మీడియాలో రచ్చ!

By:  Tupaki Desk   |   23 Jan 2021 2:30 AM GMT
ధనుష్-శింబు ఫ్యాన్స్ పంచాయితీ.. సోషల్ మీడియాలో రచ్చ!
X
సినిమా హీరోల విషయంలో అభిమానం హద్దులు దాటడం చూస్తూనే ఉంటాం. టాలీవుడ్ లోనూ పెద్ద హీరోల ఫ్యాన్స్ అప్పుడప్పుడూ ఇలా గోల చేస్తూనే ఉంటారు. అయితే.. తమిళ నాడులో మాత్రం అభిమానం వెర్రితలలు వేయడం అనేది తరచూ జరుగుతూనే ఉంటుంది. దాని తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుంది. లేటెస్ట్ గా.. ధనుష్-శింబు ఫ్యాన్స్ పంచాయితీ పెట్టారు. తమ హీరోను టార్గెట్ చేశారంటూ ధనుష్ అభిమానులు గొడకు దిగారు.

తమిళ్ ఇండస్ట్రీలో చిన్న చిన్న విషయాలు కూడా వివాదాలుగా మారుతుంటాయి. ప్రతీ విషయాన్ని ప్రెస్టేజ్ కోణంలో తీసుకుంటూ రచ్చ చేస్తుంటారు ఫ్యాన్స్. సింబు తాజా చిత్రం ‘ఈశ్వరన్’లో ‘అసురన్’ గురించి ప్రస్తావిస్తూ ఒక డైలాగ్ ఉంది. 2019లో ధనుష్ హీరోగా ‘అసురన్’ పేరుతో ఒక సినిమా వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. శింబు సినిమాలోని ఆ సంభాషణ.. తమ హీరోను కించపరిచే ఉద్దేశంతోనే పెట్టారంటూ ధనుష్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

కాగా.. ఇదే సమయంలో ధనుష్ తన ట్విటర్ బయో‌ను ‘అసురాన్ /నటుడు’ గా మార్చడం గమనార్హం. దీంతో.. శింబు సినిమాలో వచ్చిన డైలాగ్ ఖచ్చితంగా తమ హీరోను టార్గెట్ చేసిందేనని, దీనికి ప్రతిగానే ధనుష్ తన ట్విటర్ బయోను ఛేంజ్ చేశారని భావిస్తున్న ఆయన డై-హార్డ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ విషయాన్ని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో వార్ స్టార్ట్ చేశారు.