Begin typing your search above and press return to search.
రజనీ అల్లుడు ఇప్పుడు ఫీలవుతున్నాడా?
By: Tupaki Desk | 27 July 2017 11:48 AM GMTరజనీకాంత్ అల్లుడు ధనుష్ ఈమధ్యే తన `వి.ఐ.పి.2` ప్రమోషన్ కోసం హైదరాబాద్కి వచ్చిన సంగతి తెలిసిందే. ఒక ప్రముఖ ఛానల్ జర్నలిస్టు అడిగిన ప్రశ్నలపై కోపం ప్రదర్శిస్తూ మైకు విసిరికొట్టి వెళ్లిపోయిన విషయం కూడా గుర్తుండే ఉంటుంది. అయితే ఆ విషయంపై ఇప్పుడు విచారం వ్యక్తం చేస్తున్నాడట ధనుష్. అప్పుడలా ప్రవర్తించి ఉండాల్సింది కాదని తమిళ మీడియా దగ్గర ఫీలైనట్టు సమాచారం. వ్యక్తిగత జీవితం గురించి అడగడంతోనే తనకి కోపం వచ్చిందని ఆయన తన సన్నిహితుల దగ్గర చెప్పినట్టు తెలుస్తోంది.
అయితే అక్కడ కోపం రావడానికి కూడా తనకి మరో కారణం ఉందని... అప్పటికే రెండు రోజులుగా నిద్రలేకుండా సినిమా ప్రమోషన్ కోసం తిరుగుతున్నానని, అదే సమయంలోనే వ్యక్తిగత జీవితంపై అడగడంతో వెంటనే కోపం వచ్చేసిందని చెప్పుకొచ్చినట్టు తెలుస్తోంది. అయితే తెలుగు మీడియా నుంచి ధనుష్కే కాకుండా, ఆయన మరదలు సౌందర్య రజనీకాంత్ కి కూడా వ్యక్తిగత ప్రశ్నలు ఎక్కువగా ఎదురయ్యాయట. సౌందర్య ఆ ప్రశ్నలని సున్నితంగా డీల్ చేయగా, ధనుష్ మాత్రం ఆవేశం తెచ్చుకొని బయటపడిపోయాడు. అయినా ధనుష్ అలా బిహేవ్ చేయడంపై తెలుగులో కూడా భిన్నమైన స్పందన వ్యక్తమైంది. ఆ విషయాల గురించి మాట్లాడనని సింపుల్ గా చెప్పేస్తే సరిపోతుంది కదా అని, అంతగా కోపం తెచ్చుకోవల్సిన అవసరం ఏముందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.