Begin typing your search above and press return to search.

వేణు ఉడుగుల ని లైన్ లోకి తెస్తున్న ధ‌నుష్‌!

By:  Tupaki Desk   |   22 July 2022 3:30 AM GMT
వేణు ఉడుగుల ని లైన్ లోకి తెస్తున్న ధ‌నుష్‌!
X
కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ టాలీవుడ్ ని టార్గెట్ చేసాడా?  కోలీవుడ్ రేంజ్ లో ఇక్క‌డా మార్కెట్ పై పూర్తి స్థాయిలో దృష్టి ప ఎడుతున్నాడా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఇప్ప‌టికే ధ‌నుష్ తెలుగులో రెండు సినిమాలు లైన్ లో పెట్టిన సంగ‌తి తెలిసిందే. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో  `సార్ `అనే సినిమా తో లాంచ్ అవుతున్నారు. తెలుగు-త‌మిళ్ లో ఈ చిత్రం తెర‌కెక్కుతుంది.

ఇక రెండ‌వ ప్రాజెక్ట్ శేఖ‌ర్ క‌మ్ములా ద‌ర్శ‌క‌త్వంలో క‌మిట్ అయిన సంగ‌తి తెలిసిందే. వాస్త‌వానికి ఈ సినిమానే ముందుగా ప్రారంభం కావాల‌ని కానీ అనివార్యకార‌ణాల‌తో వ‌చ్చే ఏడాది కి  వాయిదా ప‌డింది. 2023 ఆరంభంలో ఈ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్క‌నుంది. ఇలా వ‌రుస‌గా రెండు  తెలుగు సినిమాలు క‌మిట్ అవ్వ‌డంతో ధ‌నుష్ తెలుగు మార్కెట్ పై ఎంత సీరియ‌స్ గా ఉన్నాడో అద్దం ప‌డుతుంది.

తాజాగా మూడ‌వ సినిమా విష‌యంలో కూడా ధ‌నుష్  టాప్ మేక‌ర్స్ తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు వెలుగులోకి వ‌స్తుంది. యంగ్ డైరెక్ట‌ర్ వేణు ఉడుగుల ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి  ధనుష్ పాజిటివ్ గా ఉన్న‌ట్లు లీకులందుతున్నాయి.  భూ స‌మ‌స్య‌లు.. పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంతో సాగే స్టోరీ అని  స‌మాచారం. ఇప్ప‌టికే ధ‌నుష్ కి  క‌థ‌  వినిపించారుట‌.

అయితే ఇంకా ఫైన‌ల్ వెర్ష‌న్ వినాల్సి ఉంద‌ని ..ఆ త‌ర్వాత అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని  తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్  నిర్మించ‌డానికి ముందుకొస్తున్న‌ట్లు స‌మాచారం. దీంతో మ‌రోసారి వేణు ఉడుగుల పేరు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతోంది.  `నీది నాది ఒకే క‌థ` సినిమాతో వేణు ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే.

ఆ సినిమాతో వేణుకి  దర్శ‌కుడిగా  మంచి గుర్తింపు ద‌క్కింది. ఆ త‌ర్వాత ఇటీవ‌లే రానా హీరోగా తెర‌కెక్కించిన `విరాట ప‌ర్వం` ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సినిమా కి  పాజిటివ్ టాక్ వ‌చ్చినా భారీ వ‌సూళ్లు సాధించ‌లేదు. కానీ విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకుంది. అంటుపై ఓటీటీ రిలీజ్ త‌ర్వాత సినిమా స్థాయి మారిపోయింది.

నెట్ ప్లిక్స్ రిలీజ్ లో సినిమా కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అందుకే ఇప్పుడు ధ‌నుష్  ని డైరెక్ట్ చేసే స్థాయికి రీచ్ అయ్యాడు. ఇన్నోవేటివ్ థాట్స్ ని ప్రోత్స‌హించ‌డంలో ధ‌నుష్ ముందుంటాడు. త‌మిళ్ లో ఇప్ప‌టిర‌వ‌కూ అలాంటి ప్ర‌యోగాలు  చేసి స‌క్సెస్ అయ్యాడు.