Begin typing your search above and press return to search.

రెండు ద‌శాబ్ధాల ధ‌నుష్ ప్ర‌యాణం!

By:  Tupaki Desk   |   10 May 2022 2:32 PM GMT
రెండు ద‌శాబ్ధాల ధ‌నుష్ ప్ర‌యాణం!
X
కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. క‌మ‌ర్శియ‌ల్ చిత్రాల‌తో పాటు వైవిథ్య‌మైన చిత్రాల‌తో ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌డం ధ‌నుష్ ప్ర‌త్యేక‌త‌. స్ర్కిప్ట్ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రలోనైనా ప‌ర‌కాయ ప్రేవేశం చేయ‌గ‌ల న‌టుడు. వెండి తెర‌పై అందంగానూ క‌నిపిస్తారు. అంధ‌హీనంగానూ ప్రేక్ష‌కుల్ని మెప్పించడం అన్న‌ది ధ‌నుష్ కేల చెల్లింది. అనువాదా చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్ని మెప్పించారు.

`వీఐపీ`..`మారి` లాంట‌లి చిత్రాలతో టాలీవుడ్ ఆడియ‌న్స్ కి మ‌రింత ద‌గ్గ‌ర‌య్యారు. `రాంజాన్` లాటి సినిమాతో హిందీలోనూ మార్కెట్ల క్రియేట్ చేసుకున్న ఏకైక స్టార్. తాజాగా ధ‌నుష్ సినిమా ప్ర‌యాణం మొద‌లై ఈఏడాదితో రెండు ద‌శాబ్ధాలు పూర్త‌యింది. 2002లో ధ‌నుష్ సినిమా ప్ర‌యాణం మొద‌లైంది. `తుల్లు వాదో ఇమ్మాయ్` అనే సినిమాతో కోలీవుడ్ లో న‌టుడిగా ప‌రిచ‌యం అయ్యారు.

ఇప్ప‌టి వ‌ర‌కూ అన్ని భాష‌ల్లో క‌లిపి దాదాపు 50 సినిమాల‌కు ద‌గ్గ‌ర‌గా పూర్తి చేసారు. ఎక్కువ‌గా త‌మిళ్ సినిమాల్లోనే న‌టించారు. హిందీలో `రాంజానా`..`ష‌మితాబ్` లాంటి చిత్రాలు చేసారు. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా లాంచ్ అవుతున్నారు. ఎంట్రీ ఇవ్వ‌క ముందే క‌మిట్ మెంట్ల జోరు పెంచారు. క్లాసిక్ చిత్రాల ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ములా ద‌ర్శ‌క‌త్వంలో మొద‌టి సినిమా చేయ‌నున్నారు.

ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏషియన్ నిర్మిస్తుంది. తెలుగు.. తమిళం.. హిందీ భాషలలో ఈ సినిమా తెరకెక్కించబోతున్నారు. అలాగే మూడు భాషలలో భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. యంగ్ మేక‌ర్ వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి `సార్` అనే టైటిల్ ని ఖరారు చేసారు.

సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ పై నాగ‌వంశీ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. ధ‌నుష్ రెండు ద‌శాబ్ధాల ప్ర‌యాణం పూర్త‌యిన సంద‌ర్భంగా `సార్` ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అలాగే `వాటే జ‌ర్నీ ధ‌నుష్` అంటూ శుభాకాంక్ష‌లు తెలిపారు. యువ నిర్మాత నాగ‌వంశీ ఇటీవ‌ల బ్యాక్ టూ బ్యాక్ స‌క్సెస్ లు అందుకుంటూ జ‌ర్నీ సాగిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కోలీవుడ్ స్టార్ హీరోతో సినిమా నిర్మించే అరుదైన అవ‌కాశాన్ని అందుకోవ‌డం విశేషం.

ప్ర‌స్తుతం ధ‌నుష్ కోలీవుడ్ లో చాలా సినిమాలు చేస్తున్నారు. నాలుగైదు సినిమాలు చేతిలో ఉన్నాయి. ఇవిగాక కొత్త ప్రాజెక్ట్ లు చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి. ధ‌నుష్ నిర్మాత‌గాను అభిరుచుని చాటుకున్నారు. ప‌లు సినిమాలు నిర్మించి ధ‌నుష్ మార్క్ ఎంట‌ర్ టైన‌ర్ గా ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌డంలో కీల‌క భాగ‌స్వామి అయ్యారు. రాష్ర్ట స్థాయిలో అవార్డులు సొంతం చేసుకున్నారు.