Begin typing your search above and press return to search.
30 కోట్లు కాపాడిన ఫకీర్
By: Tupaki Desk | 24 May 2018 11:03 AM ISTఅప్పుడప్పుడు వచ్చే డబ్బింగ్ సినిమాల ద్వారా ధనుష్ హీరోగా రజనీకాంత్ అల్లుడిగానే మనకు పరిచయం కానీ అంతకు మించి అతనిలో గొప్ప టెక్నీషియన్ నిర్మాత కూడా ఉన్నాడు. ప్రస్తుతం ది ఎక్స్ ట్రాడినరి జర్నీ అఫ్ ఫకీర్ అనే సినిమాతో హాలీవుడ్ తెరంగేంట్రం చేస్తున్న ధనుష్ దాని ప్రమోషన్ కోసం ప్రస్తుతం కేన్స్ లో ఉన్నాడు. తమిళ తెలుగు భాషల్లో డబ్బింగ్ రూపంలో రాబోతున్న ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. దానికి సంబంధించిన విశేషాలను పంచుకునే క్రమంలో ధనుష్ ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. తాను త్వరలో దర్శకత్వం చేయబోయే సినిమాకు తొలుత 100 కోట్ల బడ్జెట్ ప్లాన్ చేసుకున్నానని కానీ ఫకీర్ సినిమాలో నటించిన అనుభవం ప్రొడక్షన్ కాస్ట్ ని ఎలా తగ్గించుకోవాలో నేర్పించిందని ఇప్పుడు దీని ద్వారా 30 కోట్ల దాకా తాను మిగిలించుకునే అవకాశం కలిగిందని చెప్పాడు. అంటే ముప్పై శాతం కోత వేసుకునే ఆ టెక్నీక్ ఏదో ధనుష్ దీని ద్వారా వంటబట్టించుకున్నాడు.
పవర్ పాండి ద్వారా తనలో దర్శకుడిని కూడా సౌత్ కు పరిచయం చేసిన ధనుష్ అది కాకుండా నిర్మాతగా కూడా మంచి సినిమాలు చాలానే తీసాడు. పవర్ పాండి ఘన విజయం సాధించినా తెలుగులో రీమేక్ జరిగే ప్రయత్నాల్లో డబ్బింగ్ వెర్షన్ మనకు రాలేదు. కానీ ధనుష్ దర్శకుడిగా మాత్రం దానితో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. ఆ కాన్ఫిడెన్స్ తోనే మరో సినిమాకు భారీ బడ్జెట్ కేటాయించుకోగా ఫకీర్ సినిమా నేర్పిన అనుభవంతో తనలో మార్పు తెచ్చుకున్నాడట. మావయ్య రజనీకాంత్ ను హీరోగా పెట్టి తీసిన కాలా జూన్ 7 విడుదల కానుండగా ఫకీర్ సినిమా మే 30 విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలా కెరీర్ పీక్స్ లో ఉన్న స్టార్ హీరో దర్శకుడిగా కూడా సక్సెస్ కావడం చిన్న విషయం కాదు. రజనీకాంత్ వల్ల కూడా నెరవేరని దర్శకత్వపు కల అల్లుడు ధనుష్ చేసి చూపించాడు. అఫ్ కోర్స్ ఇద్దరు కూతుళ్లు ఆల్రెడీ చేసారు కానీ సక్సెస్ టేస్ట్ చేసింది మాత్రం ధనుషే