Begin typing your search above and press return to search.
ధనుష్ మూవీ బడ్జెట్ 1533 కోట్లు?
By: Tupaki Desk | 27 April 2022 4:42 AM GMTజాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు ధనుష్. కోలీవుడ్ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ అతడికి ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు హాలీవుడ్ లో నిరూపించుకునేందుకు తీవ్రమైన ప్రయత్నంలో ఉన్నాడు. ప్రఖ్యాత రస్సో బ్రదర్స్ తెరకెక్కిస్తున్న 'ది గ్రే మ్యాన్' లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుండి తాజాగా ధనుష్ ఫస్ట్ లుక్ విడుదలైంది. క్రిస్ ఎవాన్స్- ర్యాన్ గోస్లింగ్ నేతృత్వంలోని ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో జూలై 22న విడుదల కానుంది
ఆంథోనీ- జో రుస్సో దర్శకత్వంలో రూపొందుతున్న హాలీవుడ్ చిత్రం 'ద గ్రే మ్యాన్'. ధనుష్ ఫస్ట్ లుక్ వైరల్ గా దూసుకెళుతోంది. ఫస్ట్ లుక్ లో ధనుష్ సూపర్ హీరో తరహా పోజ్ ని ఘాటైన ఎక్స్ ప్రెషన్ తో ఇచ్చాడు.గ్రే మ్యాన్ #TheGrayMan,@NetflixFilm జూలై 22న నెట్ ఫ్లిక్స్ @Russo_Brothersలో విడుదలవుతుందని ధనుష్ తన సోషల్ మీడియా హ్యాండిల్ లో వెల్లడిస్తూ ఫస్ట్ లుక్ ను పంచుకున్నారు.
ర్యాన్ గోస్లింగ్-క్రిస్ ఎవాన్స్-అనా డి అర్మాస్- జెస్సికా హెన్విక్- బిల్లీ బాబ్ థోర్న్‌టన్ - ఆల్ఫ్రే వుడార్డ్ ల ఫస్ట్ లుక్ లను ఇంతకుముందే నెట్ ఫ్లిక్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ది గ్రే మ్యాన్ అనే టైటిల్ కి తగ్గట్టే ఈ చిత్రం కోర్ట్ జెంట్రీ అనే ఫ్రీలాన్స్ హంతకుని కథను తెరపైకి తెస్తోంది. మాజీ CIA ఏజెంట్ గురించి 2009 మార్క్ గ్రీనీ నవల ఆధారంగా రూపొందించిన చిత్రమిది. భారతీయ నటుడు ధనుష్ కూడా ఈ చిత్రంలో ఒక భాగం. నాటక ఏజెంట్ గా గోస్లింగ్ హెడ్ లైన్స్ లో నిలుస్తాడు. దెయ్యంలా ఉండే ఒక ఉన్నత స్థాయి CIA కార్యకర్తగా ధనుష్ కనిపిస్తాడు.
అతని అసలు పేరు కూడా ప్రజలకు తెలియదు. అతను దాచిపెట్టిన ఏజెన్సీ రహస్యాలను వెలికితీసినప్పుడు అతను ఒక అంతర్జాతీయ కుట్రలో చిక్కుకుపోతాడు. అంతులేని మాజీ సహోద్యోగి వలె (ఇవాన్స్ పోషించాడు) అతని తలపైనా బహుమానం ప్రకటిస్తాడు.. ఆ తర్వాత ఏం జరిగిందనేది తెరపైనే చూడాలి! అంటూ కథ కూడా లీక్ అయ్యింది.
200 మిలియన్ల డాలర్ల బడ్జెట్ తో నెట్ ఫ్లిక్స్ అత్యంత భారీగా ఈ మూవీని తెరకెక్కిస్తోంది. ఇండియన్ కరెన్సీలో దాదాపు 1533 కోట్లకు ఇది సమానం. ఇటీవల వస్తున్న అత్యంత ఖరీదైన చిత్రమిది. రస్సో బ్రదర్స్ నిర్మాణ సంస్థ AGBO ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను నిర్మిస్తోంది. జో రస్సో స్క్రిప్ట్ రాశారు. ఎండ్‌గేమ్ స్క్రీన్ రైటర్స్ క్రిస్టోఫర్ మార్కస్ మరియు స్టీఫెన్ మెక్ ఫీలీ స్క్రిప్టు కోసం పని చేశారు. ఈ చిత్రం 2022లో నెట్ ఫ్లిక్స్ లో విడుదలవుతోంది. వందల కోట్లు వెచ్చించి అత్యంత భారీగా పాన్ వరల్డ్ రేంజులో తెరకెక్కుతోంది కాబట్టి ఈ మూవీ వేల కోట్లు వసూల్ చేసే రేంజు అని భావించాలి.