Begin typing your search above and press return to search.

ఉక్కునగరంలో ధనుష్..

By:  Tupaki Desk   |   5 Oct 2015 7:30 AM GMT
ఉక్కునగరంలో ధనుష్..
X
గతేడాది వి.ఐ.పి. (తెలుగులో రఘువరన్ బిటెక్) సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ధనుష్ కి ఈ ఏడాది విజయం మొహం చాటేసింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు విడుదలైన మూడు సినిమాలూ బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. అయినా మనోడు జోరు ఏమాత్రం తగ్గలేదు. ధనుష్ చేతిలో నాలుగు సినిమాలున్నయిప్పుడు. వాటిలో ఓ సినిమా కోసమే ఇతగాడు మన ఉక్కు నగరానికి వస్తున్నది.

మైనా (ప్రేమఖైదీ) - కుమ్కీ (గజరాజు) సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ప్రభు సాల్మన్ ధనుష్ హీరోగా తమిళంలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాకి ట్రైన్ లో జరిగే యాక్షన్ సన్నివేశం చాలా కీలకమట. ఇందుకోసం దర్శకుడు కాస్త బడ్జెట్ పెంచి మరీ హాలీవుడ్ నిపుణుడిని దించాడు. సినిమా విషయంలో దర్శకుడు ఏమాత్రం తగ్గట్లేదట. అందుకే కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు విశాఖలో చిత్రీకరించడం కోసం టీమ్ ని వెంటబెట్టుకుని విశాఖకు వస్తున్నాడు ప్రభు సాల్మన్. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో హరీష్ ఉత్తమన్ ధనుష్ తో తలపడనున్నాడు.