Begin typing your search above and press return to search.
లాజిక్ మిస్సయిన కాలా అల్లుడు
By: Tupaki Desk | 8 July 2018 5:24 AM GMTకంటి ముందు కనిపిస్తున్న నిజాన్ని అబద్దం అంటే ఎవరికైనా వింతగా అనిపించడం సహజం. కాలా విజయం సాధించిందా లేదా అని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. డబ్బింగ్ వెర్షన్ అయినప్పటికీ కాలా తెలుగులో సైతం స్ట్రెయిట్ రిలీజ్ తరహాలో భారీ ఎత్తున విడుదల చేసారు. కానీ వారం పూర్తి కాకుండానే ఫలితం ఏంటో ప్రేక్షకులు తేల్చడం వచ్చినంత వేగంగా థియేటర్ల నుంచి మాయం కావడం చకచకా జరిగిపోయాయి. కాకపోతే సూపర్ స్టార్ కున్న ఇమేజ్ దృష్ట్యా తమిళనాడులో కొద్ది రోజులు ఆడింది. అయినా నష్టాలు తప్పలేదు. దీని మీద గత కొద్ది రోజులుగా కోలీవుడ్ మీడియాలో కాలా నష్టాల గురించి రకరకాల కథనాలు వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడి మేరకు నిర్మాత ధనుష్ 20 కోట్ల దాకా వెనక్కు ఇచ్చే ఒప్పందం చేసుకున్నాడని ప్రచారం జరిగింది. దాన్ని నేరుగా ఖండించకుండా వండర్ బార్ ఫిలిమ్స్ పేరు మీద అఫీషియల్ అకౌంట్ లో దాని ఓనర్లయిన ధనుష్-ఐశ్వర్య ట్విట్టర్ పెట్టిన మెసేజ్ ఆసక్తికరంగా మారింది.
కాలా గురించి కొన్ని మీడియా వర్గాల్లో వస్తున్న పుకార్లను తాము ఖండిస్తున్నామని వండర్ బార్ ఫిలిమ్స్ సంస్థకు కాలా విజయవంతమైన మరియు లాభాలు తెచ్చిన సినిమాగా మిగిలిందని ఇందుకోసం రజనీకాంత్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అందులో పేర్కొన్నారు. కాలా విడుదలకు ముందున్న హైప్ వల్ల రజని ఇమేజ్ వల్ల కాలాను మంచి రేట్లకే అమ్ముకున్నారు. ధారావి సెట్ మీద పెట్టిన ఖర్చు తప్ప కనీసం అవుట్ డోర్ షూటింగ్ కూడా చేయలేదు. అందుకే మరీ ఓవర్ బడ్జెట్ కాకుండా రీజనబుల్ గానే అయిపోయింది. అలాంటప్పుడు నష్టం వచ్చే ఛాన్స్ లేదు. అంతమాత్రానికే కాలా సూపర్ హిట్ అనలేంగా. తెలుగు రాష్ట్రాలు కలిపి తమిళనాడు బయట కాలా ఎక్కడా లాభాలు ఇచ్చిన దాఖలాలు లేవు. అలాంటాప్పుడు కాలా తమ బ్యానర్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాగా చెప్పుకోవడం పట్ల విమర్శలు కూడా వస్తున్నాయి. అలా అయితే లింగా-కబాలి కూడా బ్లాక్ బస్టర్స్ అంటారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక సినిమాను కొనడం వల్ల అందరూ లాభపడితే దాన్ని సూపర్ హిట్ అంటారు కానీ ఇలా నిర్మాణ సంస్థకు లాభం వచ్చింది కాబట్టి హిట్ అనమంటే ఎలా ధనుష్ సర్.