Begin typing your search above and press return to search.
రజినీ చేయాల్సింది నాగార్జున వద్దకు..
By: Tupaki Desk | 15 Sep 2018 12:21 PM GMTతమిళ స్టార్ హీరో ధనుష్ ఆమద్య మామ రజినీకాంత్ తో ‘కాలా’ చిత్రాన్ని నిర్మించిన విషయం తెల్సిందే. ‘కాలా’ చిత్రం సమయంలోనే మామను డైరెక్ట్ చేసేందుకు ఒక కథను సిద్దం చేశాడట. తాను స్వయంగా హీరోగా నటిస్తూ, మామ రజినీకాంత్ ను పవర్ ఫుల్ రోల్ లో చూపిస్తూ ఒక చిత్రాన్ని చేయాలని - ఆ చిత్రాన్ని 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాలని ధనుష్ కలలు కన్నాడట. కాని రజినీకాంత్ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రంలో నటించేందుకు ఆసక్తి చూపించలేదట. దాంతో రజినీకాంత్ కోసం రాసుకున్న ఆ పాత్ర కోసం మొదట తెలుగు హీరో రాజశేఖర్ ను సంప్రదించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు పుకార్లే అని - ఆ చిత్రం కోసం నాగార్జున ఎంపిక అయినట్లుగా అధికారికంగా క్లారిటీ వచ్చేసింది.
ధనుష్ స్వయంగా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు. రజినీకాంత్ తప్పుకున్న కారణంగా సినిమా బడ్జెట్ ను 100 కోట్ల నుండి 70 కోట్లకు తగ్గించినట్లుగా కూడా సమాచారం అందుతుంది. గత సంవత్సర కాలంగా ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుతున్నట్లుగా దర్శకుడు ధనుష్ చెబుతున్నాడు. ఇటీవలే ఈ చిత్రంలో అదితి రావు మరియు అను ఎమాన్యూల్ లు హీరోయిన్స్ గా ఎంపిక అయినట్లుగా వార్తలు వచ్చాయి. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ మదురైలో ప్రారంభం అయినట్లుగా తమిళ వర్గాల నుండి సమాచారం అందుతుంది.
ప్రస్తుతం ధనుష్ మరియు ముఖ్య తారాగణంపై సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే నాగార్జున చిత్రీకరణలో పాల్గొనబోతున్నాడు. ఈ చిత్రంలో ఎస్ జే సూర్య కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. తెలుగులో ధనుష్ కు పెద్దగా మార్కెట్ లేదు. నాగార్జున ఈ చిత్రంలో నటిస్తున్న కారణంగా తెలుగులో మంచి బిజినెస్ అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది వేసవి వరకు ఈ చిత్రంను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉందని తమిళ సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. రజినీకాంత్ కోసం రెడీ చేసిన పాత్రకు నాగ్ ఏ స్థాయిలో న్యాయం చేస్తాడు అనేది చూడాలి.