Begin typing your search above and press return to search.

రియల్‌ లైఫ్‌ లో సిగరెట్ వద్దు ప్లీజ్‌

By:  Tupaki Desk   |   18 July 2015 5:58 AM GMT
రియల్‌ లైఫ్‌ లో సిగరెట్ వద్దు ప్లీజ్‌
X
వెండితెరపై రింగులు రింగులుగా గుప్పు గుప్పు మంటూ పొగ వదిలే హీరోని చూస్తే ఏమనిపిస్తుంది? అభిమానుల్లో అయితే మేం కూడా అలా చేస్తే ఎలా ఉంటుంది? అని ఇన్‌ స్పిరేషన్‌ ఫీలవుతారు. టీనేజర్స్‌, అంతగా పరిణతి లేని కుర్రాళ్లు తమ అభిమాన హీరోని ఫాలో చేసేస్తారు. దీనివల్ల ఎన్నో అనర్థాలు. ఇప్పటికే క్యాన్సర్‌ మహమ్మారీని ఢీకొట్టడానికి ప్రభుత్వం చేయని ప్రయత్నమే లేదు.

అయితే ధనుష్‌ లాంటి స్టార్‌ హీరో ఇలా ఆన్‌ స్క్రీన్‌ పొగతాగుతూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం కోలీవుడ్‌ లో విస్త్రతంగా చర్చకొచ్చింది. అతడు మారియాన్‌, వీఐపీ, నిన్ననే రిలీజైన మారి వంటి చిత్రాల్లో పొగరాయుడుగా కనిపించాడు. తెరపై కనిపించినంతసేపూ సిగరెట్‌ ఊదేసే సన్నివేశాలు రిపీట్‌ వస్తుంటాయి. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, ఇలయదళపతి విజయ్‌ లాంటి వాళ్లే పొగ తాగే సీన్స్‌ లో నటించమని చెప్పారు. ఇదంతా సమాజిక బాధ్యత అని ప్రకటించారు. కానీ ధనుష్‌ వాటిని పట్టించుకోలేదు.

లేటెస్టుగా మారి అనే చిత్రంలోనూ పొగతాగే సన్నివేశాలున్నాయి. ఇదే విషయంపై ప్రశ్నిస్తే ధనుష్‌ ఇలా చెప్పాడు. కథ ప్రకారం నేను ఇందులో ఓ స్లమ్ములో ఉండే వీధి కుర్రాడి టైపు. అందుకే కథ ప్రకారం పొగ తాగాల్సొచ్చింది. వాస్తవానికి నిజజీవితంలో నేను పొగ తాగను. దయచేసి నా అభిమానులు ఇలాంటి చెడు అలవాట్లను అనుకరించవద్దు. పొగ తాగే అలవాటు ఉన్నా వదిలేయండి ప్లీజ్‌.. అంటూ అభ్యర్థించాడు. అదీ సంగతి.