Begin typing your search above and press return to search.

కెరీర్ ఫస్ట్ హిట్ కొడతాడా...

By:  Tupaki Desk   |   22 Sep 2016 5:10 AM GMT
కెరీర్ ఫస్ట్ హిట్ కొడతాడా...
X
కోలీవుడ్ హీరో ధనుష్.. తొలిసారిగా టాలీవుడ్ లో పెద్ద అటెంప్ట్ చేస్తున్నాడు. టాలీవుడ్ లో మొదటి హిట్ కోసం దూసుకొస్తున్నాడు ధనుష్. ఇప్పటికే బాలీవుడ్ లో కూడా సక్సెస్ చూసిన ఈ తమిళ హీరో.. రైల్ చిత్రం ద్వారా టాలీవుడ్ లోనూ తొలి హిట్ అందుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.

అదేంటీ.. ధనుష్ మూవీ ఒకటి గతంలో హిట్ అయిందిగా.. రఘువరన్ బీ టెక్ మంచి సక్సెస్ నే సాధించింది కదా అనుకోవచ్చు. కానీ ఆ చిత్రాన్ని తమిళ్ లో సూపర్ హిట్ అయిన తర్వాత.. తెలుగులోకి తీసుకొచ్చారు. అప్పటికే మూవీపై మంచి రిపోర్టులు ఉండడం.. కాన్సెప్ట్ యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉండడంతో.. తొందరగా ఎక్కేసింది. తెలుగులో సక్సెస్ అయినా సరే ఆల్రెడీ హిట్ సినిమా కావడంతో.. దాన్ని ఎంజాయ్ చేయలేకపోయాడు ధనుష్. కానీ ఇప్పుడు రైల్ విషయంలో అలా కాదు. అటు తమిళ్ లో తొడరి.. తెలుగులో రైల్ టైటిల్స్ తో ఒకేసారి రిలీజ్ అయిపోతోంది. అందుకే ఈ చిత్రం హిట్ అయితే.. తెలుగులో ధనుష్ మార్కెట్ విపరీతంగా పెరుగుతుంది.

సినిమా అంతా దాదాపుగా రైల్ లోనే సాగే ఈ స్టోరీపై చాలా అంచనాలే ఉండగా.. ఈ చిత్రంలో ట్యాలెంటెడ్ మల్లూ బ్యూటీ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించడం.. మరో ఆకర్షణ కానుంది. మరి ఈ రైల్ ఎంతమంది ప్రేక్షకులను ఎక్కించుకుంటుందో మరి కొన్ని గంటల్లో తేలిపోతుంది.