Begin typing your search above and press return to search.

పాట‌తోనే ధ‌నుష్ రొమాన్స్‌.. సిగ్గు మొగ్గ‌లేసిన ఐశ్వ‌ర్య‌!

By:  Tupaki Desk   |   5 May 2021 3:30 PM GMT
పాట‌తోనే ధ‌నుష్ రొమాన్స్‌.. సిగ్గు మొగ్గ‌లేసిన ఐశ్వ‌ర్య‌!
X
కోలీవుడ్ స్టార్ హీరో ధ‌నుష్ యాక్టింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అసుర‌న్ వంటి సినిమాలో ఆయ‌న నేచుర‌ల్ న‌ట‌న‌కు జాతీయ అవార్డే ఫిదా అయి, వ‌చ్చి ఆయ‌న ఒళ్లో వాలిపోయింది. అయితే.. తాజాగా.. అద్భుత‌మైన‌ పాట‌గాడిగా నిరూపించుకున్నారు ధ‌నుష్‌.

అదికూడా ఎవ‌రిపాట‌నో కాదు.. త‌న మామ, సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ మూవీ ‘పేట్టా’ చిత్రంలోనిది. ‘ఇల‌మై థిరుంబుదే’ అని సాగే రొమాంటిక్ సాంగ్ ను ధ‌నుష్ అందుకోవ‌డంతో.. ప‌క్క‌నే ఉన్న భార్య ఐశ్వ‌ర్య సిగ్గుప‌డిపోయింది. భార్య‌ను దృష్టిలో పెట్టుకొనే ఈ పాట పాడ‌డంతో ఆమె లోలోప‌ల ఎంత‌గానో ఆనంద‌ప‌డిపోయారు.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. ఈ వీడియో చూసిన వాళ్లంతా ధ‌నుష్ టాలెంట్ ను మెచ్చుకుంటూనే.. క్యూట్ క‌పుల్ స్వీట్ రొమాన్స్ ను చూసి క‌ల‌ర్ ఫుల్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక‌, ధ‌నుష్ సినిమాల గురించి చూస్తే.. ప్ర‌స్తుతం హాలీవుడ్ లో తెర‌కెక్కుతున్న ‘ది గ్రే మ్యాన్‌’ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అమెరికాలోనే ఉన్నాడు ధ‌నుష్‌.