Begin typing your search above and press return to search.
తమన్నాని తీసేసి అమలా పాల్ తో??
By: Tupaki Desk | 9 July 2016 4:16 AM GMTఅదేంటో తెలియదు కాని.. 2009 నుండి జనాల నోళ్ళలో నానుతున్న ఈ సినిమా.. అప్పటినుండి పట్టాలెక్కిందే లేదు. ఆ సినిమా పేరు ''వడా చెన్నయ్''. హీరో ధనుష్ లీడ్ లో నటిస్తూ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు వెట్రిమారన్ దర్శకుడు. అయితే 2009 మొదలుపెడదాం అనుకుని ఆపేసి.. మళ్లీ 2012లో స్టార్టు చేస్తున్నట్లు చెప్పారు. కాని అప్పటినుండి ఈ సినిమా మొదలయితే ఒట్టు.
కారణాలు తెలియవు కాని.. అప్పట్లో ఆపేసిన ఈ సినిమాను ఇప్పుడు 2016 మే నెలలో మొదలెట్టాలి. ఇప్పటికే ముగ్గురు హీరోయిన్లను మార్చి చివరకు సమంతను ఓకె చేశాడు ధనుష్. అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. కాని అమ్మడు మాత్రం ఈ సినిమా చేయలేనంటూ మొన్ననే అడ్వాన్స్ తిరిగిచ్చేసింది. కట్ చేస్తే ఈ పాత్రను చేయడానికి తమన్నా ఒప్పుకుందని వార్తలొచ్చాయి. కాని తను ''విఐపి'' సినిమాతో హిట్టు కొట్టినందుకు గాను అమలా పాల్ అయితే సెంటిమెంటల్ గా బాగుంటుందని ఫీలైన ధనుష్.. ఇప్పుడు మిల్కీబ్యూటీని తీసేసి అమలా పాల్ ను పెట్టుకుందామని చూస్తున్నాడట. అందుకే సినిమా షూటింగ్ ఇంకా మొదలవ్వలేదు.
మొత్తానికి ధనుష్ కెరియర్ లో ఇన్నేళ్ళుపాటు డిస్కషన్లో ఉన్న సినిమా ఇదొక్కటే. ఇక దర్శకుడు వెట్రిమారన్ ఉన్నాడే.. 2009లో ఈ సినిమాను ఆపేసి ధనుష్ తో ఆడుకలాం సినిమాను తీసి అవార్డులు కొట్టాడు. మొన్న విసరనయ్ సినిమాతో కూడా అలాగే అవార్డులు కొట్టాడు. అందుకే ధనుష్ కు ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి మరోసారి అవార్డులు కొట్టాలని ఉందట.