Begin typing your search above and press return to search.
ధనుష్ 'సార్' వచ్చేది అప్పుడే!
By: Tupaki Desk | 31 Oct 2022 2:30 AM GMTతమిళ చిత్ర పరిశ్రమంలో ఇటీవల కాలంలో వరుస విజయాలను అందుకుంటున్న ధనుష్ ఇప్పుడు మరో సినిమాతో సక్సెస్ అందుకోవడానికి రెడీ అవుతున్నాడు. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న సార్ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇక సినిమాకు సంబంధించిన అన్ని పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. అయితే ఈ క్రమంలో సినిమా వాయిదా పడబోతున్నట్లు కూడా ఒక టాక్ అయితే వినిపించింది. మిగతా సినిమాల నుంచి పోటీ ఉండడం అలాగే షూటింగ్ కొంత ఆలస్యం గా పూర్తయింది అనే కారణం చేత ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉంది అని జనవరి సంక్రాంతి కూడా రావచ్చని అందరు అనుకున్నారు.
లేదా ఆ తర్వాత 2023 ఫిబ్రవరిలో కూడా రావచ్చు అనే విధంగా తమిళ మీడియాలో కొన్ని కథనాలు అయితే వెలువడ్డాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదు అని తెలుస్తుంది. చిత్ర యూనిట్ ని ప్రత్యేకంగా సంప్రదించగా వాళ్ళు సినిమా అనుకున్న సమయానికి డిసెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వివరణ ఇచ్చేశారు. ఇక ఈ సినిమాలో ధనుష్ ఒక స్కూల్ టీచర్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే.
ఇక దర్శకుడు వెంకీ అట్లూరి సినిమాలో ఒక మంచి సోషల్ మెసేజ్ ను ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇంతకుముందు ఈ దర్శకుడు పూర్తిస్థాయిలో రొమాంటిక్ లవ్ సినిమాలతో ఆకట్టుకున్నాడు. తొలిప్రేమ సినిమా తర్వాత మిస్టర్ మజ్ను కూడా బాగానే ఆకట్టుకుంది. కానీ ఆ తర్వాత నితిన్ తో చేసిన రంగ్ దే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. ఇక ఈసారి ఎలాగైనా సార్ తో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలి అని ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగా సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.