Begin typing your search above and press return to search.
అప్పుడు ఇప్పుడు చాలా నెర్వస్ గా ఫీల్ అవుతున్నా: ధనుష్
By: Tupaki Desk | 16 Feb 2023 10:03 AM GMTతెలివైన వాడు అందిన ప్రతి అవకాశంలోనూ తన ప్రతిభను కనబరచాలని చూస్తాడు. అలాంటి తెలివైన నటుడు ధనుష్. తన ప్రతీ చిత్రంలో ఏదో ఓ వైవిధ్యం ఉండేలా చూసుకుంటారు ఈ మల్టీ టాలెంటెడ్ ధనుష్. ఆయన ప్రస్తుతం నటించిన తాజా చిత్రం సార్.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో సంయుక్త మీనన్ తో కలిసి నటించారు. తమిళంలో వాతి గా రానుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ కానుంది.
హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ధనుష్ మాట్లాడుతూ- "సార్ బలమైన భావోద్వేగాలతో కూడిన ఓ సింపుల్ సినిమా. సందేశం, వినోదం ఉంటాయి. సినిమా అన్నివర్గాల వారికి నచ్చుతుంది. ఎందుకంటే ప్రేక్షకులు వాళ్ల కథతో కనెక్ట్ అవుతారు. సార్ మీ అందరి కథ.. మీకు నచ్చుతుందని, అందరూ ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. 2002లో నా తొలి చిత్రం విడుదలయినప్పుడు నెర్వస్‌గా ఉన్నా.. ఇప్పుడు 2023లో నా తొలి తెలుగు సినిమా రిలీజ్ అవుతోంది.. ఇప్పుడు కూడా అలాగే ఉంది.
తమిళ్, హిందీ, ఇంగ్లిష్ సినిమాలు చేశాను.. ప్రతి సినిమాని నా మొదట దిగానే భావిస్తా. సార్ ఒక సింపుల్ ఫిల్మ్.. కానీ, గ్రాండ్ ఎమోషన్స్, మెసేజ్ ఉంటుంది. నా తర్వాతి తెలుగు సినిమాకి తప్పకుండా తెలుగులో మాట్లాడతాను. వంశీ, వెంకీ చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు.
నాకు మాత్రం ఇంకా భయం వేస్తుంది. ఇది మీ అందరి కథ. డైరెక్టర్ కి ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. మంచి కథ తీసుకొచ్చినందుకు. త్రివిక్రమ్ గారు నాకు చాలా మంచి వెల్కమ్ ఇచ్చారు. ప్రతిరోజూ సాయి కుమార్ గారు ఇంటి నుంచి లంచ్ తెచ్చారు. మీ భార్యకు కూడా థ్యాంక్స్ చెప్పండి.
హైపర్ ఆది క్రేజ్ చూసి షాక్ అయ్యాను. అతని పేరు చెప్పగానే విజిల్స్, అరుపులు వినిపిస్తున్నాయి. తమన్ నా ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడు. అఖండలో మీ వర్క్ బాగా నచ్చింది. జీవి దీనికి మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా అందరికి నచ్చుతుంది. సుమ గారు సూపర్" అని ధనుష్ చెప్పారు. అలాగే మాస్టారు మాస్టారు సాంగ్ పాడి అందర్నీ అలరించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.