Begin typing your search above and press return to search.
మనోడి హాలీవుడ్ సినిమాకు అవార్డు
By: Tupaki Desk | 7 May 2019 12:22 PM GMTఇండియన్స్ ఫిల్మ్ యాక్టర్స్ హాలీవుడ్ సినిమాల్లో నటించడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. కొన్ని సార్లు బాలీవుడ్ కు చెందిన స్టార్స్ నటించినా కూడా సౌత్ కు చెందిన వారు చాలా చాలా అరుదుగా నటిస్తారని చెప్పుకోవచ్చు. అలాంటిది తమిళ స్టార్ హీరో ధనుష్ 'ఎక్ట్సార్డినరీ జర్నీ ఆఫ్ ఏ ఫకీర్' అనే హాలీవుడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ చిత్రం గురించి ఎక్కువగా ప్రచారం చేయకుండా సైలెంట్ గా పూర్తి చేసి తాజాగా విడుదల చేశారు. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంకు మంచి స్పందన దక్కుతోంది.
ఇంగ్లీష్ తో పాటు స్పెయిన్ లో కూడా ఈ చిత్రం విడుదల చేసింది. గత వారం ఇండియా, ఇటలీ, ఫ్రాన్స్, లిబియా ఇంకా పలు దేశాల్లో ఈ చిత్రం విడుదలైంది. ఇక తాజాగా స్పెయిన్ లో బారిసిలోనాలో సెయింట్ జార్జి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది. అక్కడ ఈ చిత్రంను ప్రదర్శించడంతో పాటు ఉత్తమ కామెడీ చిత్రంగా కూడా అవార్డు దక్కించుకుంది. ధనుష్ ఈ చిత్రంతో ఉత్తమ కమెడియన్ గా అవార్డు దక్కించుకున్నాడు. ఈ విషయాన్ని ధనుష్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి తన సంతోషాన్ని పంచుకున్నాడు.
'ఎక్ట్సార్డినరీ జర్నీ ఆఫ్ ఏ ఫకీర్' చిత్రంలో స్ట్రీట్ మెజిక్ మన్ గా ధనుష్ నటించాడు. తన నటనతో కామెడీ పండించి నవ్వులు పూయించాడు. తనకు ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయని నమ్మించేందుకు ధనుష్ చేసే ప్రయత్నం చేయడం చాలా కామెడీగా ఉంది. మొదటి హాలీవుడ్ సినిమాతోనే మంచి గుర్తింపు పొందిన ధనుష్ పూర్తి స్థాయి హాలీవుడ్ నటుడిగా మారుతాడేమో అంటూ అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.