Begin typing your search above and press return to search.
క్రేజీగా హృతిక్-ధనుష్ మల్టీస్టారర్!
By: Tupaki Desk | 28 July 2019 7:24 AM GMT2013 లో రాంజానా సినిమాతో ధనుష్ బాలీవుడ్ కి పరిచయమైన సంగతి తెలిసిందే. నటించిన తొలి సినిమాతోనే క్రిటిక్స్ ప్రశంసలు అందుకోవడమే గాక బ్లాక్ బస్టర్ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమాకి జాతీయ అవార్డు దక్కింది. ధనుష్ ఉత్తమ తొలి చిత్ర నటుడిగా ఫిలింఫేర్ అందుకున్నాడు. ఆ ఏడాది ఐఫా అవార్డు సహా జీ .. స్టార్ అవార్డులు అందుకున్నాడు. ధనుష్ నటన ఉత్తరాది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ తర్వాత బిగ్ బి అమితాబ్ తో కలిసి `షమితాబ్` అనే చిత్రంలో నటించాడు. 2015లో రిలీజైంది ఈ చిత్రం.
నాలుగేళ్ల తర్వాత తిరిగి ధనుష్ మళ్లీ బాలీవుడ్ లో అడుగు పెడుతున్నాడు. ఈసారి కండల హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఓ భారీ చిత్రంలో నటించనున్నాడు. `రాంజానా` డైరెక్టర్ ఆనంద్.ఎల్.రాయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సైఫ్ డాటర్ సారా అలీఖాన్ ఓ కథానాయికగా నటించనుంది. హృతిక్ .. ధనుష్ పాత్రలు ఎలా ఉండబోతున్నాయి? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్. 2020లో ఈ సినిమాని పట్టాలెక్కించేందుకు ట్యాలెంటెడ్ ఆనంద్.ఎల్.రాయ్ సన్నాహకాల్లో ఉన్నాడు.
ఉత్తరాది- దక్షిణాది సంగమం ఇటీవల హాట్ టాపిక్. దక్షిణాది సినిమాల్లో ఉత్తరాది హీరోలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పలువురు ఉత్తరాది హీరోలు దక్షిణాదిన విలన్లుగానూ పాపులరవుతున్నారు. ఇక దక్షిణాది స్టార్లు ఉత్తరాది చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించడం ట్రెండ్ గా మారింది. నాగార్జున (బ్రహ్మాస్త్ర)- ధనుష్ లాంటి స్టార్లు బాలీవుడ్ లో నటిస్తుండడంతో ఈ తరహాలో ఇతర దక్షిణాది స్టార్లు బాలీవుడ్ కి వెళ్లే ఛాయిస్ పెరుగుతోందనడంలో సందేహం లేదు.