Begin typing your search above and press return to search.
ధనుశ్ ధాటిని తట్టుకోవడం కష్టమే!
By: Tupaki Desk | 23 April 2021 5:30 PM GMTకోలీవుడ్లో ధనుశ్ ను ప్రయోగాలకి .. సాహసాలకు మారుపేరుగా చెబుతారు. మొదటి నుంచి కూడా ధనుశ్ కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ వస్తున్నాడు. కథాకథనాల విషయంలో మంచి పట్టు ఉన్న ఆయన, కొంతకాలంగా లుక్ విషయంలోను ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నాడు. ఈ మధ్య కాలంలో ఆయన చేసిన ప్రయోగాలు బాగానే ఫలించాయి. 'మారి 2' .. 'అసురన్' .. 'పట్టాస్' .. 'కర్ణన్' సినిమాలు సాధించిన విజయాలే అందుకు నిలువెత్తు నిదర్శనం. తమిళ సినిమాలతో పాటు హిందీ .. ఇంగ్లిష్ సినిమాలను కూడా ఆయన రిలీజ్ కి రెడీ చేస్తుండటం విశేషం.
తమిళంలో ఒక వైపున సీనియర్ స్టార్ హీరోలుగా రజనీ .. కమల్ కొనసాగుతున్నారు. ఆ తరువాత ఒక వైపున అజిత్ .. విజయ్, మరోవైపున సూర్య .. కార్తి .. విక్రమ్ తమదైన క్రేజ్ తో దూసుకుపోతున్నారు. ఇంత పోటీలోను ధనుశ్ తనదైన ప్రత్యేకతను చాటుతూ వెళుతుండటం విశేషం. అజిత్ - విజయ్ సినిమాలు కమర్షియల్ గా రికార్డుస్థాయి వసూళ్లను రాబడుతూ ఉంటాయి. కానీ కథాకథనాల విషయానికి వచ్చేసరికి, వైవిధ్యం పరంగా ధనుశ్ సినిమాలకి ఎక్కువ ఓట్లు పడతాయి.
అజిత్ .. విజయ్ తమకి గల స్టార్ డమ్ ను దృష్టిలో పెట్టుకుని, ఒక రేంజ్ దాటని కథలను మాత్రమే చేస్తూ వెళుతుంటారు. బడ్జెట్ విషయంలోను వాళ్లకి కొన్ని లెక్కలు ఉంటాయి. ధనుశ్ మాత్రం తన ఇమేజ్ ను ఒక చట్రానికి కట్టేయలేదు. కొత్తగా కనిపించే .. అనిపించే కథలను వరుసగా చేసుకుంటూ వెళుతుంటాడు. బడ్జెట్ ఒక పరిధిలో ఉండేలా చూసుకుంటూ .. సాధ్యమైనంత వేగంగా ఎక్కువ సినిమాలు చేసేస్తూ ఉంటాడు. అందువలన కోలీవుడ్లో యంగ్ హీరోలకి ధనుశ్ నుంచే గట్టిపోటీ ఎదురవుతోందనే మాట అక్కడ ఎక్కువగా వినిపిస్తోంది. ఆయన ధాటిని తట్టుకోవడం వాళ్లకి కష్టంగానే ఉందట.